Job Mela: 26న మినీ జాబ్‌ మేళా.. వీరు అర్హులు

జనగామ రూరల్‌: నిరుద్యోగ యువతీ యువకులకు మినీ జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ అధికారి మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ సెక్టార్‌ అపోలో ఫార్మసీ కంపెనీలో 50 ఖాళీలు ఉన్నాయని, నెలవారీ వేతనం రూ.11,600 నుంచి రూ.25,000 ఉంటుందని, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ సదుపాయాలున్నాయని పేర్కొన్నా రు. డీ, బీ, ఎం ఫార్మసి ఉండాలని టెన్త్‌, ఇంట ర్‌, ఏదైనా డిగ్రీ, వయసు 18 నుంచి 25 ఏళ్ల లోపు వారు అర్హులని తెలిపారు.

చదవండి: GAIL Recruitment 2024: గెయిల్‌లో 391 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. చివరి తేదీ ఇదే

బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్‌ ప్రతులతో సెప్టెంబ‌ర్ 26న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌ ఎస్‌–8 కార్యాలయంలో జరిగే జాబ్‌ మేళాకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు జె.గీత, సీనియర్‌ అసిస్టెంట్‌ను 7995430401 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

‘మెడికల్‌’ ఉద్యోగాలకు 141 దరఖాస్తులు

జనగామ: మెడికల్‌ కళాశాలతో పాటు జిల్లా ఆస్పత్రిలో 13 కేటగిరీల పరిధిలో భర్తీ చేయను న్న 50 పోస్టులకు సెప్టెంబ‌ర్ 23న‌ మొదటి రోజు 141 దరఖాస్తులు వచ్చినట్లు కళాశాల ప్రిన్సి పాల్‌ డాక్టర్‌ గోపాల్‌రావు తెలిపారు. సెప్టెంబ‌ర్ 28 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.

#Tags