HCU: ఎంబీఏలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
గ చ్చిబౌలిలోని స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ ఈ కోర్సు నిర్వహిస్తోంది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ డిసెంబర్ 15. దరఖాస్తుదారులు తప్పనిసరిగా 60 శాతం మార్కులతో డిగ్రీ పాసై ఉండాలి. అంతేకాకుండా కామన్ అడ్మిషన్ టెస్ట్ (సీఏటీ)–2022 స్కోర్ సాధించాలి.
చదవండి: Admission in UoH: యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఎంబీఏ కోర్సులో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..
గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంబీఏ అడ్మిషన్ నోటిఫికేషన్ ప్రాస్పెక్టస్, ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్‌ల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. మరిన్ని వివరాలకు స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ డీన్ కార్యాలయంలో లేదా.. 040–23135000 ద్వారా సంప్రదించవచ్చు.
చదవండి: TSCHE: క్షణాల్లో నకిలీ సర్టిఫికెట్లు పట్టేయొచ్చు!.. వెబ్‌సైట్‌ను ప్రారంభించిన విద్యామంత్రి