TSCHE: వీసీలతో లింబాద్రి భేటీ

రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాలయాల ఉప కులపతులతో తెలంగాణ‌ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి ఏప్రిల్‌ 23న భేటీ అవుతారు.
తెలంగాణ‌ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి

మండలి కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో వైస్‌ చైర్మన్ ప్రొఫెసర్‌ వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాస్‌ పాల్గొంటారు. రాష్ట్రంలో అన్ని ప్రవేశ పరీక్షలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్త అకడమిక్‌ కేలండర్‌ రూపొందించాల్సి ఉంది. దీనిపై సమావేశంలో చర్చిస్తారని అధికారులు తెలిపారు. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ తేదీలు, ఇంజ నీరింగ్‌ సీట్ల భర్తీ, ప్రైవేటు కాలేజీలకు అను బంధ గుర్తింపుపై కూడా చర్చించే వీలుంది. 

#Tags