VP Gautham: విద్యార్ధిగా, ఉపాధ్యాయుడిగా వ్యవహరించిన జిల్లా కలెక్టర్

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ సెప్టెంబర్ 6న విద్యార్ధిగా పాఠాలు వినడంతో పాటు ఉపాధ్యాయుడిగా వ్యవహరించి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు.
విద్యార్ధిగా, ఉపాధ్యాయుడిగా వ్యవహరించిన జిల్లా కలెక్టర్

ఖమ్మం జిల్లా మధిర మండలంలోని సిరిపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సెప్టెంబ‌ర్ 6న‌ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, గౌతమ్‌ సందర్శించారు. మంత్రి వెళ్లిపోయాక కలెక్టర్‌ పాఠశాలలోనే కొద్దిసేపు ఉండి పదవ తరగతి గదిలో ఆంగ్ల ఉపాధ్యాయుడు రవీందర్‌ పాఠాలు చెబుతుండగా విద్యార్థుల పక్కనే కూర్చుని విన్నారు. పాఠం పూర్తయ్యాక విద్యార్థులను పలు ప్రశ్నలు వేసి సమాధానాలు అడిగారు. ఆంగ్ల భాషపై విద్యార్థులు మరింత పట్టు సాధించాలని సూచించారు.

#Tags