SPMVV: ఘనంగా మహిళా వర్సిటీ స్నాతకోత్సవం

తిరుపతి ఎడ్యుకేషన్‌: తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ 19, 20వ స్నాతకోత్సవాన్ని నవంబర్‌ 11న ఘనంగా నిర్వహించారు.
గవర్నర్ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ అందుకుంటున్న పద్మజారెడ్డి

వర్సిటీలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన వేడుకల్లో వీసీ హోదాలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పాల్గొని విద్యార్థినులకు డిగ్రీ పట్టాలు, గోల్డ్‌ మెడల్స్, పుస్తక, నగదు బహుమతులను అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన ప్రముఖ శాస్త్రీయ కూచిపూడి నృత్యకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం పద్మజారెడ్డి హాజరవగా, గవర్నర్‌ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు.

చదవండి: పద్మావతి మహిళా వర్సిటీలో రెండు కొత్త కోర్సులు

యూనివర్సిటీ ప్రగతి నివేదికను వీసీ ప్రొఫెసర్‌ దువ్వూరు జమున చదివి వినిపించారు. స్నాతకోత్సవం సందర్భంగా డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, ఎంఫిల్‌ విభాగాల్లో 988 మంది గవర్నర్‌ చేతుల మీదుగా పట్టాలు అందుకున్నారు. అలాగే 108 మంది విద్యార్థినులు గోల్డ్‌ మెడల్స్‌ పొందారు. కళాశాల ఎన్‌ఆర్‌ఐ విద్యార్థిని ఆముక్తమాల్యద సుష్మ పీహెచ్‌డీ పట్టాను గవర్నర్‌ చేతుల మీదుగా అందుకున్నారు. మస్కట్‌కు చెందిన ఆమె.. మ్యూజిక్‌ విభాగం(ఇంటర్నల్‌ రిలేషన్స్‌)లో 2021 జూలైలో పీహెచ్‌డీ చేశారు.

చదవండి: ASCI: ప్రకటనల్లో నేటి మహిళ!

#Tags