Skill Training: యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణ

నిరుపేద కుటుంబాల్లో అర్హులైన యువతకు వివిధ రంగాల్లో ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇప్పించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు తీసుకుంటోంది.
యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణ

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా వందరోజుల పనులు పూర్తిచేసిన కుటుంబాల్లోని అర్హులైన పిల్లలకు ఈ ఉచిత నైపుణ్య శిక్షణనిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువతకు ఆయా అంశాల్లో శిక్షణతో పాటు వందరోజుల పాటు స్టైపెండ్‌ చెల్లింపు, ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగ కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఎంప్లాయ్‌మెంట్‌ జనరేషన్, మార్కెటింగ్‌ మిషన్ లో భాగంగా 56 ఏజెన్సీల ద్వారా స్వయం ఉపాధి కల్పన నిమిత్తం ప్రస్తుతం దాదాపు వందకు పైగా కేంద్రాల్లో ఉచిత వసతితో పాటు, నైపుణ్య శిక్షణనిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎల్రక్టీషియన్, ప్లంబింగ్, వెల్డింగ్, పెయింటింగ్‌ వంటి రంగాల్లో నైపుణ్యాలున్న వారి కొరత ఉందని గుర్తించారు. ఉన్నతి పథకంలో భాగంగా వందరోజులు ఉపాధిహామీ పనులు పూర్తిచేసిన వారి కుటుంబాల్లోని అర్హులైన యువతీ యువకుల గుర్తింపు ప్రక్రియ సాగుతోంది. నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్ స్ట్రక్షన్ (ఎన్ ఏసీ) ద్వారా ఈ నైపుణ్య శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమం కింద మొత్తం రెండువేలమంది యువతీ యువకులకు శిక్షణనిచ్చేందుకు కార్యాచరణను సిద్ధంచేశారు. వీరిలో తొలుత వెయ్యిమందికి శిక్షణ కార్యక్రమాలు పూర్తిచేశాక, తర్వాత మిగతా వెయ్యి మందికి శిక్షణను అందిస్తారు. 

చదవండి: 

Good News: నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ

నిరుద్యోగ యువతకు భరోసా

Skill Training: ఉన్నత స్థానాలు చేరుకునేందుకే నైపుణ్య శిక్షణ 

#Tags