విద్యా, వైజ్ఞానిక మహాసభ పోస్టర్ ఆవిష్కరణ
సాక్షి, సిటీబ్యూరో: టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో ఫిబ్రవరి 11, 12 వ తేదీలలో జరిగే టీపీటీఎఫ్ రాష్ట్ర ద్వితీయ విద్యా, వైజ్ఞానిక మహాసభల పోస్టర్‌ను హైదరాబాద్ జిల్లా విద్యాధికారి రోహిణి జనవరి 30న ఆవిష్కరించారు.
విద్యా, వైజ్ఞానిక మహాసభలు ఉపాధ్యాయుల్లో బాధ్యతలు మరింత పెంచే విధంగా చైతన్యం కలిగిస్తాయని ఆమె ఆకాంక్షను వ్యక్తం చేశారు. సభలు విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు.
చదవండి: NCC Discipline: ఎన్‌సీసీ వంటి క్రమశిక్షణే విజయానికి పునాది
టీపీటీఎఫ్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు కె.సీతారామ శాస్త్రి, ఎం.వెంకటేశ్వరరెడ్డి, కార్య దర్శులు పి.సోమిరెడ్డి, వి.కామేశ్వరి, రాష్ట్ర కౌన్సిలర్లు ఎ.రమణారావు, ఎం.వెంకటరమణ పాల్గొన్నారు.
#Tags