Admissions: రేడియోలాజికల్‌ ఫిజిక్స్‌ దరఖాస్తుల గడువు తేదీ ఇదే..

ఉస్మానియా యూనివర్సిటీ: (హైదరాబాద్‌) ఓయూ ఫిజిక్స్‌ విభాగంలో కొనసాగుతున్న పోస్ట్‌ ఎమ్మెస్సీ డిప్లొమా ఇన్‌ రేడియోలాజికల్‌ ఫిజిక్స్‌ కోర్సులో ప్రవేశానికి రూ.500 అపరాధ రుసుముతో డిసెంబర్ 19 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పీజీ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పాండురంగారెడ్డి డిసెంబర్ 10న‌ తెలిపారు.

ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ లేదా న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ కోర్సుల్లో 60 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు ఈ కోర్సులో ప్రవేశానికి అర్హులని పేర్కొన్నారు. డిసెంబర్ 21న ఉదయం 11 గంటల నుంచి 12.30 గంటల వరకు ఓయూ దూరవిద్య కేంద్రంలో ప్రవేశ పరీక్ష జరగనున్నట్లు వివరించారు. పూర్తి వివరాలకు ఉస్మానియా వెబ్‌సైట్‌ చూడాలని సూచించారు.  

చదవండి: Andesri State Anthem: పాఠ్యపుస్తకాల్లో అందెశ్రీ రాష్ట్ర గీతం

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
#Tags