Justice NV Ramana: విద్యార్థుల నుంచి పెద్ద నేతలేరీ?

అన్యాయాన్ని ప్రశ్నించడంలో విద్యార్థులే ఎల్లప్పుడూ ముందుంటారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణ చెప్పారు.
భారత ప్రధాన న్యాయమూర్తి - జస్టిస్ ఎన్వీ రమణ

అయినప్పటికీ గత కొన్ని దశాబ్దాలుగా విద్యార్థి సమాజం నుంచి పెద్ద నాయకులెవరూ రాలేదని అన్నారు. ఆయన డిసెంబర్ 9న ఢిల్లీలో నేషనల్ లా యూనివర్సిటీ 8వ స్నాతకోత్సవంలో మాట్లాడారు. యువత సామాజికంగా, రాజకీయంగా చైతన్యవంతంగా ఉంటే ప్రజా సమస్యల పరిష్కారానికి దోహదపడతారని పేర్కొన్నారు. ముందు చూపు ఉన్న నిజాయతీపరులైన యువత రాజకీయాల్లోకి వస్తే ప్రజాస్వామ్యం పరిపుష్టం అవుతుందని పిలుపునిచ్చారు. మన సమాజంలో విద్యార్థులు కూడా ఒక భాగమేనని, వారు ఒంటరిగా జీవించడం లేదని, స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం, విలువలకు పరిరక్షకులుగా పని చేయాలని జస్టిస్ ఎన్ వీ రమణ కోరారు. విద్యావంతులైన యువత సమాజానికి దూరంగా ఉండరాదని హితవు పలికారు. దేశాన్ని ముందుకు నడిపించాలి్సన బాధ్యత యువతపై ఉందన్నారు.

చదవండి: 

యువత నడతపైనే దేశ భవిష్యత్తు

నల్సా కార్యనిర్వాహక చైర్మన్‌గా ప్రస్తుతం ఎవరు ఉన్నారు?

బాలిక లేఖతో స్పందించిన సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ.. సజ్జనార్‌కు లేఖ

#Tags