Fee Reimbursement: బీసీ విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్‌పై హర్షం

కరీంనగర్‌: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక సంస్థల్లో చేరే బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, పోస్టుమెట్రిక్‌ హాస్టల్‌ విద్యార్థుల వసతులకు సంబంధించిన జీవో విడుదలపై బీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
బీసీ విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్‌పై హర్షం

ఈ మేరకు బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నారోజు రాకేశ్‌చారి ఆధ్వర్యంలో జూలై 27న‌ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను శాలువాతో సన్మానించారు. మంత్రి మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్ల విద్యార్థులకు సీఎం కేసీఆర్‌ సర్కార్‌ తీపికబురు అందిస్తుందన్నారు. ప్రీమెట్రిక్‌ హాస్టల్‌ విద్యార్థుల మాదిరే రాష్ట్రంలోని బీసీ పోస్ట్‌మెట్రిక్‌ హాస్టళ్ల విద్యార్థులకు సంపూర్ణ వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు.

చదవండి: Telangana: ‘కేసీఆర్‌ విద్యాబంధు’.. వీరికి సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక సంస్థల్లో చేరే బీసీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రకటించిన సీఎం కేసీఆర్‌, మంత్రి గంగుల కమలాకర్‌లకు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్నం ప్రకాశ్‌, రాష్ట్ర కార్యదర్శి జీఎస్‌ ఆనంద్‌, బీసీ యువజన సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాదాసు సంజీవ్‌, బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బోయిని ప్రశాంత్‌, బియ్యాని తిరుపతి, నాయకులు పాల్గొన్నారు.

చదవండి: Fee Reimbursement: జాతీయ విద్యా సంస్థల్లో చదివే ఈ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌

#Tags