Degree Spot Admissions: స్పాట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు

ములుగు రూరల్‌: జిల్లాలోని సమ్మక్క–సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో స్పాట్‌ అడ్మిషన్లకు ఆహ్వానిస్తున్నట్లు ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ పోరిక తుకారం సెప్టెంబ‌ర్ 23న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

అక్టోబర్‌ 3వ తేదీన స్పాట్‌ అడ్మిషన్లు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు వివరించారు. బీఏ హనర్స్‌ ఇంగ్లిష్‌లో 24 సీట్లు ఖాళీ ఉండగా జనరల్‌ 9, ఎస్సీ 4, ఎస్టీ 2, ఓబీసీ 7, ఈడబ్ల్యూస్‌ 2 ఉన్నాయని తెలిపారు. బీఏ హనర్స్‌ ఎకనామిక్స్‌లో మొత్తం 23 సీట్లు ఖాళీగా ఉండగా జనరల్‌ 8, ఎస్సీ 4, ఎస్టీ 2, ఓబీసీ 7, ఈడబ్ల్యూస్‌ 2 ఉన్నాయని పేర్కొన్నారు.

చదవండి: ECIL Hyderabad Recruitment: ఈసీఐఎల్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. చివరి తేదీ ఇదే

ఆసక్తి కలిగిన అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పాస్‌ సర్టిఫికెట్లు, ట్రాన్స్‌ఫర్‌, మైగ్రేషన్‌ సర్టిఫికెట్లు, పాస్‌ ఫొటోలు, మెడికల్‌ అఫిడవిట్‌, కుల ధ్రువీకరణ పత్రాలను స్మార్ట్‌ ఫోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయడంతో పాటు గూగుల్‌ ఫారం పూర్తి చేయాలని సూచించారు. వివరాలకు సెల్‌ నంబర్‌ 9959090799లో సంప్రదించాలని కోరారు.
 

#Tags