ITDA PO Prateek Jain: స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

భద్రాచలం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోర్సుల శిక్షణ ఇవ్వనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్‌జైన్‌ తెలిపారు.
స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

వివిధ శిక్షణా సంస్థల ద్వారా వెబ్‌ మొబైల్‌ అప్లికేషన్‌, బ్యూటీషియన్‌, అసిస్టెంట్‌ ఎలక్ట్రీషియన్‌, సోలార్‌ టెక్నీషియన్‌, సీసీ టీవీ టెక్నీషియన్‌, పుట్టగొడుగుల సాగు, డెయిరీ ఫార్మింగ్‌, వర్మీ కంపోస్ట్‌ తయారీ, టూవీలర్‌ మెకానిక్‌ అంశాల్లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. పదిహేను రోజుల నుంచి రెండునెలల పాటు సాగు శిక్షణలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని తెలిపారు.

చదవండి: Foreign Employment: విదేశీ ఉద్యోగావ‌కాశాలు

వెబ్‌ మొబైల్‌ అప్లికేషన్‌, బ్యూటీషియన్‌ కోర్సుల్లో మహిళలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. కోర్సుల వారీగా అర్హత నిర్ధారించగా, ఆసక్తి కలిగిన గిరిజన యువత విద్యార్హత పత్రాలు, ఆధార్‌ కార్డు, కుల ధ్రువీకరణ జిరాక్స్‌ సర్టిఫికెట్లతో అక్టోబ‌ర్ 10వ తేదీన ఉదయం 9 గంటలకు ఐటీడీఏ ప్రాంగణంలోని యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని పీఓ సూచించారు.

చదవండి: Jobs: సమాచారశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

#Tags