AU: దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ పరీక్షలు తేదీలు ఇవే..

ఏయూక్యాంపస్‌: ఆంధ్రవిశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో ఎంబీఏ, ఎంబీఏ(హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌), ఎంసీఏ, పీజీ డిప్లమా ఇన్‌ కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ అండ్‌ అప్లికేషన్‌(పీజీడీసీపీఏ) కోర్సుల మొదటి సెమిస్టర్‌ పరీక్షలు ఏప్రిల్‌ 17వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయని కేంద్రం సంచాలకుడు ఆచార్య కె.విశ్వేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ పరీక్షలు తేదీలు ఇవే..

ఉదయం 9 నుంచి 12 గంటల వరకు రా ష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 20 కేంద్రాలలో పరీక్షలు జరుగుతాయన్నారు. పీజీడీసీపీఏ–1లో బ్యాక్‌లాగ్‌ ఉన్న విద్యార్థులు ఏయూ దూరవిద్య కేంద్రంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో మాత్రమే పరీక్షలు రాయాల్సి ఉంటుందన్నారు. హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌ www.andhrauniversitysde.com నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

చదవండి:

TOEFL: ఇకపై రెండు గంటల్లోనే ఈ పరీక్ష

IT: ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌ల ఉద్యోగాలు తొల‌గింత‌... ఐటీ అంటేనే భ‌య‌ప‌డుతున్న ఉద్యోగులు

#Tags