కానిస్టేబుల్ కొడుకు ఐపీఎస్ అవుతాడా..! అంటూ ఎగతాళి : రోహిత్‌రాజు ఐపీఎస్
వారి లక్ష్యం కోసం శ్రమిస్తున్న సమయంలో సమాజంలో చాలా మంది ఇలా వెనుక నుంచి వెక్కిరించినవారున్నారు. అలాంటి వారి అంచనాలు తప్పు అంటూ.. లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ మిడిల్ క్లాస్ అబ్బారుులంతా నేడు ఐపీఎస్ అధికారులయ్యారు. కల సాకారం చేసుకున్నారు.
సంకల్పం, పట్టుదల ఉంటే ఎంతటి సుదూర లక్ష్యమైనా చిన్నబోతుంది అనడానికి ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారులే మంచి ఉదాహరణ. సివిల్స్ ఛేదించడానికి మునుపటి స్థాయిలో కష్టపడక్కర్లేదని, ఇంటర్‌నెట్ ఉండటంతో పట్టుదల ఉన్న వారు ఎవరైనా సివిల్స్ లక్ష్యాన్ని చేరుకోవచ్చని భరోసా కల్పిస్తున్నారు.
తెలంగాణకు కేంద్రం 11 మంది ఐపీఎస్‌లను కేటారుుంచింది. వారిలో నలుగురు ‘సాక్షి’తో మాట్లాడారు. అఖిల్ మహాజన్, బాలస్వామి, రోహిత్‌రాజు, రూపేశ్ చెన్నూరి...అంతా లోకల్ బ్యాచ్. వీరిలో అఖిల్ కూకట్‌పల్లిలో సాధారణ బ్యాచిలర్. బాలస్వామి ఓయూలో పాఠాలు చెప్పిన అసిస్టెంట్ ప్రొఫెసర్. రోహిత్‌రాజు, బాలస్వామి కిట్స్ కాలేజీలో అల్లరి చేసిన కుర్రాళ్లే. అందరిదీ మిడిల్‌క్లాస్ నేపథ్యమే. వారి స్వప్నం వారిని వీఐపీలుగా మార్చింది. లా అండ్ ఆర్డర్‌ను కాపాడే ఐపీఎస్‌లను చేసింది.
అప్పుడే నాకు సాధించాలన్న కసి పెరిగింది..
నేను పుట్టి పెరిగింది వరంగల్‌లోనే. నాన్న అప్పట్లో సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్. కిట్స్‌లో ఇంజనీరింగ్ చేశా. నాన్నను చూసి చాలా స్ఫూర్తి పొందాను. అందుకే ఐపీఎస్ ఎంచుకున్నా. 2013లో డిగ్రీ అయ్యాక ఐపీఎస్ సాధించాలన్న కసి పెరిగింది. ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నా. ఎట్టకేలకు సాధించా. చాలా మంది కానిస్టేబుల్ కొడుకు ఐపీఎస్ అవ్వడమేంటి? అనుకున్నారు. కానీ నా కలముందు ఆ మాటలు చిన్నవైపోయారుు. లక్ష్యానికి పేదరికం అడ్డుకాదు. కల నెరవేరే దాకా వెనకడుగు వేయకండి.
- రోహిత్‌రాజు, ఐపీఎస్

#Tags