Garima Agarwal, IAS: ఈ లాజిక్ ప‌ట్టా.. సివిల్స్ కొట్టా..

సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో గరిమా అగర్వాల్ జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించారు.
Garima Agarwal, IAS

గరిమది మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖర్గోన్ . సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన ఈమె సివిల్స్‌కు ఎలా ప్రిపేర్ అయింది..? తమకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు ఎవరు? తదితర అనుభవాలను సాక్షికి వివరించారు.

ఇక్కడ ట్రిపుల్‌ ఐటీ చదవడం ఎంతో లాభించింది..
ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో చదవడం ఎంతో ప్రయోజనం చేకూర్చిందని, పృథ్వి హౌజ్‌లో కల్చరల్ ప్రతినిధిగా ఉన్నానని గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. 2014లో ఏఏ ఎంఏఎస్-2016లో సింగపూర్ సదస్సులో సర్టిఫికెట్ ఎక్స్‌లెన్స్ అవార్డు పొందడం మరిచిపోలేని సంఘటన. ప్రొఫెసర్లు కౌల్, కమలార్‌కర్లపాలెమ్ ఎంతగానో స్పూర్తినిచ్చారు.

ట్రిపుల్ ఐటీ తర్వాత ఏం చదివారు? 
ట్రిపుల్ ఐటీ చదివిన తర్వాత జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్‌బాన్ లో రోబోటిక్స్‌లో ఇంటర్న్‌షిప్ చేశాను. అనంతరం న్యూఢిల్లీకి వెళ్లి సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యా. సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది.

సివిల్స్ ఎందుకు ఎంపిక చేసుకున్నారు?
సమాజానికి ఏమైనా చేయాలనే తపనతోనే సివిల్స్‌కు ప్రిపేరయ్యా. ట్రిపుల్ ఐటీలో చదువు పూర్తి చేశాక విదేశాల్లో పరిశ్రమలు, పరిశోధనలో అవకాశాలు వచ్చాయి. కానీ సివిల్స్ ప్రిపేర్ కావాలని గ్రేడ్ 4లోనే ఉన్నప్పుడు నిర్ణయించుకున్నా. మధ్యప్రదేశ్‌లో సంయుక్త కార్యదర్శిగా పనిచేసే అల్కా ఉపాధ్యాయ యూపీఎస్‌సీ టాపర్‌గా నిలిచింది ఆమెను స్పూర్తిగా తీసుకొని చదివాను.

సివిల్స్‌కు ఎలా ప్రిపేర్‌అయ్యారు?
న్యూఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకున్నా. జనరల్‌స్టడీస్. ప్రణాళికా బద్ధంగా చదవడం, టైమ్ టేబుల్ ఏర్పాటు చేసుకొన్నా. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత సివిల్స్ ప్రిపేర్ కావడం ఇబ్బందే అయినా ఇంజినీర్ల సైంటిఫిక్ టెంపర్‌మెంట్, లాజిక్ అప్రోచ్ నన్ను సివిల్స్ రాణించేలా చేశారుు.

ఎవరెవరు తోడ్పాటునందించారు?
ఐఏఎస్ అధికారి హిమాన్షు జైన్, ఐపీఎస్ అధికారి పంకజ్‌కుమావత్, కమల్‌సర్ సివిల్స్ సర్వీసెస్‌లో ర్యాంకు సాధించడంలో ఎంతో తోడ్పాటును అందించారు.

Ankitha Sharma, IPS: బాలీవుడ్ సెలబ్రిటీలకు ఏ మాత్రం తీసిపోదు..ఈ లేడీ ఐపీఎస్‌

Success Story: పేదరికం అడ్డుపడి.. వేధించిన నా ల‌క్ష్యాన్ని మాత్రం మరువ‌లేదు..

Success Story: ట్యూషన్లు చెప్పుతూ.. రిసెప్షనిస్టుగా ప‌నిచేస్తూ.. ఐపీఎస్ అయ్యానిలా..

Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..​​​​​​​

#Tags