Poorna Sundari IAS Success Story : కంటి చూపు లేకపోతే ఏమి.. ఆత్మ విశ్వాసం ఉంటే చాలు క‌దా.. ఆడియోలో వింటూ.. ఐఏఎస్ కొట్టానిలా..

ఆమెకు కంటి చూపులేదు. ఊహ తెలియని వయసులోనే ఆమె కంటి చూపు కోల్పోయింది. కానీ.. ఆమెలో ఆత్మ విశ్వాసం మాత్రం ఏ మాత్రం కోల్పోలేదు. అందుకే.. నేడు అందరికీ ఎంతో కష్టతరమైన సివిల్స్‌ను ఆమె సాధించింది.
Poorna Sundari IAS Success Story

ఈమె తమిళనాడుకు చెందిన పూర్ణ సుందరి. ఈ నేప‌థ్యంలో ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలిచిన సివిల్స్ ర్యాంక‌ర్ పూర్ణ సుందరి స‌క్సెస్ స్టోరీ మీకోసం.. 

➤☛ IAS Success Story : కూలీనాలీ చేస్తూ చ‌దివాడు.. ఐఏఎస్ సాధించాడు.. కానీ ఈయ‌న పెళ్లి మాత్రం..

చిన్న వ‌య‌స్సులోనే..

మధురైకి చెందిన పూర్ణ సుందరి తన ఐదేళ్ల వయసులో కంటి చూపు మందగించింది. ఒకటో తరగతికి రాగానే పూర్తిగా కంటిచూపును కోల్పోయింది. అయినప్పటికీ చదువును ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. తల్లిదండ్రులు, స్నేహితుల సహకారంతో కష్టపడి చదివింది. ఐఏఎస్ కావాలని లక్ష్యం పెట్టుకుంది. అందుకు తగ్గట్టు ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రిపరేషన్ కొనసాగించింది. మొదటి మూడుసార్లు సివిల్స్‌లో విజయం సాధించలేకపోయింది. నాలుగో ప్ర‌య‌త్నంలో 286 ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికై అందరికి ఆదర్శంగా నిలిచింది. పూర్ణ సుందరి 2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఈమె అద్భుత ప్రతిభపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

➤☛ Inspirational Success Story : నిజంగా.. ఈ క‌లెక్ట‌ర్ స్టోరీ మ‌న‌కు క‌న్నీరు పెట్టిస్తోంది..

ఆడియోలో వింటూ..

ఆడియో స్టడీ మెటీరియల్‌తో పరీక్షలు రాయడం చాలా కష్టం. ఈ విషయంలో ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు పుస్తకాలను ఆడియో ఫార్మాట్‌లో మార్చడానికి సహాయం చేశారు. ఎంతో పట్టుదలతో సివిల్స్‌లో మంచి ర్యాంక్‌ సాధించి ఐఏఎస్‌కు ఎంపికైంది.

☛ IPS Success Story : ఇంట్లో చెప్ప‌కుండా.. ఐపీఎస్ కొట్టానిలా.. కానీ..

#Tags