Bollywood Actress IPS officer Simala Prasad Success Stroy : ఈ ప్రముఖ నటి.. ఎలాంటి కోచింగ్ లేకుండా.. తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్ కొట్టిందిలా.. కానీ..
ఈమే ప్రముఖ బాలీవుడ్ నటి.. ఐపీఎస్ అధికారి సిమల ప్రసాద్. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటి, ఐపీఎస్ అధికారి సిమల ప్రసాద్ సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
సిమల ప్రసాద్.. మధ్యప్రదేశ్‌లో 1980 అక్టోబర్ 8వ తేదీన జన్మించారు. ఈమె నాన్న Bhagirath Prasad. ఈయన ఐఏఎస్ అధికారి. అలాగే ఈమె అమ్మ Mehrunnisa Parvez. ఈమె ప్రముఖ రచయిత్రి.
ఎడ్యుకేషన్ :
సిమల ప్రసాద్.. భోపాల్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ చదువుకున్నారు. ఆ తరువాత కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.అలాగే ఈమె నృత్యం, నటనపై ఆసక్తిని పెంచుకుంది. మరోవైపు తండ్రి ఐఏఎస్ అధికారిగా ఉన్నప్పటికీ, సివిల్ సర్వీస్ మార్గంవైపు చూడలేదు.
నటి కావాలనే ఆశతో..
నటనపై ఆసక్తితో అలిఫ్, నక్కష్ మూవీల్లో అవకాశాలను దక్కించుకున్నారు. ఈ క్రమంలో అలీఫ్ సినిమాలో షమ్మీ పాత్రకు గాను విమర్శకులు ప్రశంసలు దక్కాయి. అలా నటి కావాలనే ఆమె కల నెరవేరింది. ఇలా నటనను కొనసాగిస్తూనే భోపాల్‌లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశారామె.
పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలో కూడా..
ఆ తరువాత మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అలా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హోదా వరించింది. ఈ క్రమంలోనే యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ కావడం కూడా ప్రారంభించింది. ఇక్కడితో ఆమె ఆగిపోలేదు. ఈ క్రమంలోనే యూపీఎస్సీ పరీక్షపై దృష్టిపెట్టారు. అంతేకాదు తొలిప్రయత్నంలోనే ఎలాంటి కోచింగ్ లేకుండానే పరీక్షలో విజయం సాధించి ఐపిఎస్ అధికారిణి కావడం విశేషం. ఈమె 2010 బ్యాచ్‌కి చెందిన మహిళా ఐపీఎస్ ఆఫీసర్.
ఆకర్షణీయమైన ఎంటర్ టైన్‌మెంట్ రంగం నుంచి ఐపీఎస్ అధికారిగా మారింది ఈ ప్రముఖ బాలీవుడ్ నటి సిమల ప్రసాద్. సంకల్పం, పట్టుదల ఉంటే చాలా నిరూపించారు. నటిని కావాలన్న ఆశయంతో బాలీవుడ్‌లో నటిగా అడుగు పెట్టిన తర్వాత కూడా తన మరో లక్ష్యాన్ని మాత్రం మర్చిపోలేదు. ఈ జీవిత ప్రస్థానం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిధాయకం.