ఇంజనీరింగ్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ ‘ఇంటర్న్‌షిప్’
బీటెక్.. ఏటా లక్షల మంది చేరే కోర్సు! ఎన్నో ఎంట్రన్స్‌లను ఎదుర్కొని.. కళాశాలలో ఉత్సాహంగా కాలుమోపుతున్నారు! కానీ, నాలుగేళ్ల డిగ్రీ చేతికందాక.. జాబ్ మార్కెట్లో నిరాశాజనక పరిస్థితులే ఎదురవుతున్నాయి! మొత్తం విద్యార్థుల్లో 20-22 శాతం మందికి మాత్రమే ‘ఉద్యోగ నైపుణ్యాలు’ ఉంటున్నాయనేది.. పరిశ్రమ, అకడమిక్ వర్గాల అభిప్రాయం.
ఈ పరిస్థితికి పరిష్కారంగా.. ఏఐసీటీఈ రూపొందించిన ‘తప్పనిసరి ఇంటర్న్‌షిప్’ మార్గదర్శకాలు 2019-20 విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో అమలుకానున్నాయి! ఈ నేపథ్యంలో ఇంటర్న్‌షిప్‌తో లభించే ప్రయోజనాలతోపాటు విద్యార్థులు అవలంబించాల్సిన వ్యూహాలపై.. ‘ఇంటర్న్‌శాల’ సీఈఓ సర్వేశ్ అగర్వాల్ అందిస్తున్న వివరాలు...
తప్పనిసరి..
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) మార్గదర్శక సూత్రాలు బీటెక్‌లో చేరిన వారంతా రెండు, నాలుగు, ఆరు సెమిస్టర్ల అనంతరం తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్ చేయాలని నిర్దేశిస్తున్నాయి. అంతేకాకుండా ఇంటర్న్‌షిప్స్‌కు సంబంధించి క్రెడిట్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ప్రతి 40-45 గంటల వ్యవధికి ఒక క్రెడిట్ చొప్పున మొత్తం 14 నుంచి 20 క్రెడిట్స్ ఇవ్వనున్నారు. దీన్నిబట్టి విద్యార్థులు సర్టిఫికెట్ అందుకోవాలంటే ఇంటర్న్‌షిప్ చేయడం తప్పనిసరిగా మారింది. అదేవిధంగా విద్యార్థులకు ఇంటర్న్‌షిప్స్ అవకాశాలు కల్పించేందుకు వీలుగా ప్రతి కళాశాలలోనూ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్‌ను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. పరిశ్రమ వాస్తవ పరిస్థితులపై కళాశాల నుంచి బయటకు వస్తున్న విద్యార్థుల్లో సరైన అవగాహన ఉండటం లేదని.. వారిలో నూతన సాంకేతికత నైపుణ్యాలు పెంపొందించాలనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్న నేపథ్యంలో ఏఐసీటీఈ తాజా చర్యలకు ఉపక్రమించింది. వివిధ వర్గాల నుంచి వచ్చే సూచనల మేరకు తప్పనిసరి ఇంటర్‌నషిప్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు.
ఇంటర్న్‌షిప్ అంటే..?
విద్యార్థులకు క్షేత్రస్థాయి నైపుణ్యాలు అందించే తొలి సాధనంగా ఇంటర్న్‌షిప్‌ను పేర్కొనవచ్చు. ప్రస్తుతం అంతర్జాతీయ నిర్వచనం మేరకు.. ఇంటర్న్‌షిప్ అంటే విద్యార్థులు కొద్దిరోజుల పాటు ఒక సంస్థలో వాస్తవ పని వాతావరణంలో విధులు నిర్వహించడం. దీని వల్ల విద్యార్థులకు సదరు ఇండస్ట్రీలోని పరిస్థితులపై అవగాహన లభించడంతోపాటు తాజా నైపుణ్యాలు సొంతమవుతాయి.
ప్రయోజనాలు అనేకం..
ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనాల వివరాలు...
సాఫ్ట్‌స్కిల్స్‌కు పదును :
ప్రస్తుతం అన్ని రంగాల్లో వినిపిస్తున్న మాట.. సాఫ్ట్‌స్కిల్స్. ఇంటర్న్‌షిప్ ఫలితంగా విద్యార్థుల్లో ఈ నైపుణ్యాలు పెంపొందుతాయి. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఒక బృందంలో సభ్యుడిగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సహచరులతో చర్చించడం, స్వీయ పరిశీలనలను బృందానికి వివరించడం, స్థితప్రజ్ఞత తదితర లక్షణాలు అలవడతాయి.
సాంకేతికత వినియోగం :
ఇంటర్న్‌షిప్ వల్ల విద్యార్థులకు పరిశ్రమలో వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతికతల గురించి తెలుసుకొనే అవకాశం లభిస్తుంది. ఉదాహరణకు సీఎస్‌ఈ బ్రాంచ్ ఇంటర్న్ ట్రైనీని పరిగణనలోకి తీసుకుంటే ఇంటర్న్‌షిప్‌లో భాగంగా సదరు అభ్యర్థికి సంస్థ వినియోగిస్తున్న ఐఓటీ, ఏఐ, మెషీన్ లెర్నింగ్, బ్లాక్‌చైన్ టెక్నాలజీలపై అవగాహన లభిస్తుంది. ఫలితంగా ఇంటర్న్‌షిప్ పూర్తయ్యే సమయానికి ఎంప్లాయిబిలిటీ నైపుణ్యాలు అలవడతాయి.
సమస్యా పరిష్కార నైపుణ్యాలు :
ఇంటర్న్‌షిప్ వల్ల తాజా నైపుణ్యాలు, వాస్తవ పరిస్థితులపై అవగాహన తోపాటు సమస్యా పరిష్కార నైపుణ్యాలు అలవడతాయి. ఇంటర్న్‌షిప్ సమయంలో విద్యార్థులు ఏదైనా సంస్థలోని ప్రాజెక్ట్‌వర్క్‌లో భాగస్వాములై ఉంటారు. ఈ క్రమంలో నిరంతరం ఏదో ఒక సమస్య ఎదురవుతుంది. దీంతో ఆయా సమస్యలను పరిష్కరించడానికి మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. ఫలితంగా విద్యార్థుల్లో వాస్తవ మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేస్తూ సమస్యలను పరిష్కరించే ఆలోచనా శక్తి పెంపొందుతుంది.
బృంద స్ఫూర్తి :
ఇంటర్న్‌షిప్ సమయంలో బృంద సభ్యుడిగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థుల్లో బృందంగా పనిచేసే నైపుణ్యాలు పెంపొందుతాయి. నలుగురితో కలిసి మాట్లాడటం.. అభిప్రాయాలను పంచుకోవడం వంటి లక్షణాలు అలవడతాయి.
భవిష్యత్తుకు పునాది :
ఇంటర్న్‌షిప్ భవిష్యత్తు కెరీర్‌కు పునాదిగా నిలస్తుంది. ఇంటర్న్ ట్రైనీగా ఒక సంస్థలో విధులు నిర్వహించేసమయంలో మంచి పనితీరు కనబరిస్తే.. సదరు సంస్థే కోర్సు పూర్తయ్యాక శాశ్వత ఉద్యోగం కల్పించే అవకాశం ఉంది. ఐఐటీలు, ఐఐఎంలు తదితర ఇన్‌స్టిట్యూట్‌లలో క్యాంపస్ ఆఫర్లు పొందిన వారిలో నూటికి 70 శాతం మంది ఇంటర్న్‌షిప్ చేసిన సంస్థల్లోనే శాశ్వత ఉద్యోగాలను సొంతం చేసుకుంటున్నారు. ఏఐసీటీఈ నిర్ణయంతో యూనివర్సిటీ, అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు సైతం ఈ అవకాశం లభించనుంది.
స్టైపెండ్ :
ఇంటర్న్‌షిప్ సమయంలో కొన్ని సంస్థలు స్టైపెండ్ అందిస్తున్నాయి. అయితే తాజా నిబంధనల నేపథ్యంలో లక్షల మంది విద్యార్థులకు స్టైపెండ్ అందించే విషయంలో పరిశ్రమ వర్గాలు ఏ మేరకు మొగ్గు చూపుతాయనేది ప్రశ్నార్థకమే! అయితే విద్యార్థులు స్టైపెండ్ గురించి ఆలోచించకుండా ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని సొంతం చేసుకోవడంపై దృష్టిసారించాలి.
అందుకోవడమెలా..?
ఏఐసీటీఈ తాజా నిబంధనలతో లక్షల మంది విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా ఇన్‌స్టిట్యూట్‌లకు ఇండస్ట్రీ వర్గాలతో సరైన పరిచయాలు, సంబంధాలు లేవు. ప్రతి ఇన్‌స్టిట్యూట్ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పినప్పటికీ.. సదరు ఇన్‌స్టిట్యూట్‌కు పరిశ్రమ వర్గాలతో పరిచయాలు లేనట్లయితే ఆశించిన ప్రయోజనాలు పొందడం కష్టమే. టైర్-1 ఇన్‌స్టిట్యూట్‌లు ఈ విషయంలో కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ.. టైర్-2, టైర్-3 ఇన్‌స్టిట్యూట్‌లు మాత్రం పూర్తిగా వెనకబడ్డాయి. ఈ నేపథ్యంలో ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరిచేసి, క్రెడిట్స్ కేటాయించడంతో విద్యార్థుల్లో కొంత ఆందోళన నెలకొంది.
స్వీయ ప్రయత్నాలు :
ఈ పరిస్థితుల్లో విద్యార్థులు ఇంటర్న్‌షిప్స్ పొందేందుకు స్వీయ ప్రయత్నాలు చేయాలి. అప్పటికే ఉద్యోగాల్లో చేరిన పూర్వ విద్యార్థుల నుంచి సహకారాన్ని, పరిచయాలను ఉపయోగించుకోవాలి. అదేవిధంగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారా ఆయా రంగాల్లోని నిపుణులతో పరిచయాలు పెంచుకొని వారి ద్వారా ఇంటర్న్‌షిప్స్ పొందేందుకు కృషిచేయాలి.
సెర్చ్ ఇంజన్లు, వెబ్‌సైట్లు..
ఇంటర్న్‌షిప్ అవకాశాల గురించి తెలుసుకొని.. వాటిని పొందేందుకు జాబ్‌సెర్చ్ పోర్టల్స్, వెబ్‌సైట్లు ఉపయోగపడుతున్నాయి. పలు సంస్థలు జాబ్‌సెర్చ్ పోర్టల్స్, వెబ్‌సైట్లలో ఇంటర్న్ ట్రైనీ అవకాశాలను గురించి పేర్కొంటున్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు సదరు వేదికలను సందర్శిస్తూ ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందుకొనేందుకు ప్రయత్నించాలి.
ఏఐసీటీఈ తోడ్పాటు :
విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించేందుకు ఏఐసీటీఈ జాతీయస్థాయిలో పలు చర్యలు తీసుకుంటోంది. ఇంటర్న్‌శాల సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఏఐసీటీఈ అనుబంధ కళాశాలల్లోని విద్యార్థులు ఇంటర్న్‌శాల సంస్థ వెబ్‌సైట్లో రిజిస్టర్ చేసుకుంటే.. వారి ప్రొఫైల్, ఆధారంగా అప్పటికే సంస్థల్లో ఉన్న ట్రైనీ అవకాశాల వివరాలను అందిస్తుంది. తద్వారా విద్యార్థులు సదరు సంస్థల్లో ఇంటర్న్ ట్రైనీ ఎంపిక ప్రక్రియలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈ ప్రక్రియలో విజయం సాధిస్తే ఇంటర్న్ ట్రైనీగా అడుగుపెట్టి భవిష్యత్తు కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు.
ఇంజనీరింగ్ డిగ్రీ-ఇంటర్న్‌షిప్ (క్రెడిట్ విధానం) :

షెడ్యూల్ | వ్యవధి | కార్యకలాపాలు | క్రెడిట్స్ |
రెండో సెమిస్టర్ తర్వాత వేసవి సెలవులు | 3-4 వారాలు | అంతర/అంతర్గత సంస్థాగత కార్యకలాపాలు | 3-4 |
నాలుగో సెమిస్టర్ తర్వాత వేసవి సెలవులు | 4-6 వారాలు | పారిశ్రామిక/ప్రభుత్వ/ఎన్‌జీవో /ఎంఎస్‌ఎంఈ/రూరల్ /నవకల్పన/ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ | 4-6 |
ఆరో సెమిస్టర్ తర్వాత వేసవి సెలవులు | 4-6 వారాల | పారిశ్రామిక/ప్రభుత్వ/ఎన్‌జీవో/ ఎంఎస్‌ఎంఈ/ రూరల్ /నవకల్పన/ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ | 4-6 |
8వ సెమిస్టర్ | 3-4 వారాలు | ప్రాజెక్టు వర్క్, సెమినార్ | 3-4 |
మొత్తం | | | 14-20 |
విద్యార్థులకు ప్రయోజనాలు...
- నాణ్యమైన ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు పొందొచ్చు.
- సంస్థాగత వాతావరణంలో ప్రాక్టికల్ నైపుణ్యాలను సంపాదించొచ్చు.
- తరగతిగదిలో నేర్చుకున్న సైద్ధాంతిక అంశాలను ప్రాక్టికల్ ప్రపంచంలో పరీక్షించేందుకు వీలుంటుంది.
- కెరీర్ ఎంపికలో సరైన నిర్ణయం తీసుకునేందుకు దోహదం చేస్తుంది.
- అనుబంధ పరిజ్ఞానం, కొత్త నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు అవకాశం.
- కమ్యూనికేషన్, బృంద కార్యకలాపాల నైపుణ్యాలను ప్రాక్టీస్ చేసేందుకు అవకాశం.
- క్షేత్రస్థాయిలో సమయ పాలన, మల్టీటాస్కింగ్ తదితర వ్యూహాల అభ్యసనకు వీలు.
- కొత్త వ్యక్తులను కలిసే అవకాశంతో పాటు నెట్‌వర్కింగ్ నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు.
- రెజ్యూమెలో అదనపు నైపుణ్యాలను చేర్చే అవకాశం.
#Tags