ఐఈఎస్‌లో సేవాదృక్పథానికి పెద్దపీట
ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.. రైల్వేలు, టెలికం వంటి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్ష. ఇటీవల కాలంలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ మొదలు పలు రిక్రూట్‌మెంట్ పరీక్షల విధానంలో మార్పులు తీసుకొస్తున్న యూపీఎస్‌సీ తాజాగా ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పరీక్ష విధానంలోనూ మార్పులకు శ్రీకారం చుట్టింది. జనరల్ స్టడీస్ పేపర్‌లోనూ ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్‌కు ఎక్కువ ప్రాధాన్యం మిచ్చేలా రూపొందించిన ఈ మార్పులు ఐఈఎస్- 2017 నుంచి అమల్లోకి వస్తాయని యూపీఎస్‌సీ పేర్కొన్న నేపథ్యంలో కొత్త విధానంపై విశ్లేషణ..
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికం సబ్జెక్టుల్లో ఆయా బ్రాంచ్‌లలో బీటెక్ అర్హతగా నిర్వహించే ఐఈఎస్ పరీక్షకు దేశ వ్యాప్తంగా తీవ్ర పోటీ నెలకొంది. అదే సమయంలో ఎంపికైన అభ్యర్థుల్లో అధిక శాతం మంది సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో తుది జాబితాలో నిలుస్తున్నారని, వారిలో సేవా దృక్పథం కూడా పెంచాలని ఈ పరీక్ష విధానంలో మార్పులపై నియమించిన కమిటీ పేర్కొంది. దీని ప్రకారం యూపీఎస్‌సీ కొత్త పరీక్ష విధానం అమలుకు రంగం సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా విధి విధానాలు ప్రకటించింది.
తగ్గిన పేపర్లు.. పెరిగిన మార్కులు
2017 నుంచి అమలు కానున్న ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కొత్త విధానంలో పేపర్ల సంఖ్య తగ్గింది. అయితే ఇదే సమయంలో మొత్తం మార్కుల సంఖ్య పెరిగింది. ఆ వివరాలు..
కొత్త విధానం
స్టేజ్-1 (ఆబ్జెక్టివ్ విధానం)
స్టేజ్-2 (కన్వెన్షల్ విధానం)
స్టేజ్-3
ఐఈఎస్ ప్రస్తుత విధానం
సెక్షన్-1 (ఆబ్జెక్టివ్ పరీక్ష)
సెక్షన్-2(కన్వెన్షనల్ విధానం)
ప్రస్తుత విధానంతో పోల్చితే, కొత్త విధానంలో ఇంజనీరింగ్ సబ్జెక్ట్ పేపర్ల సంఖ్య తక్కువయినట్లు కనిపించినా వాటికి కేటాయించిన మార్కులు మాత్రం పెరిగాయి. ప్రస్తుతం సబ్జెక్ట్ పేపర్లకు 200 మార్కుల చొప్పున ఉండగా మారనున్న విధానంలో ఇంజనీరింగ్ నైపుణ్యాలను పరీక్షించే స్టేజ్-2 పరీక్షలో సంబంధిత సబ్జెక్ట్‌లలో రెండు పేపర్లకు 300 మార్కుల చొప్పున నిర్ణయించారు.
సేవా దృక్పథానికి ప్రాధాన్యం
ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్షలో మారిన విధానం ప్రకారం అభ్యర్థుల్లో సబ్జెక్టు నైపుణ్యాలతోపాటు సేవా దృక్పథం పరీక్షిస్తారు. అభ్యర్థులు తమ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ స్కిల్స్‌ను సామాజిక అభివృద్ధికి అన్వయించగలిగే నైపుణ్యాలను పరీక్షించేందుకు పెద్దపీట వేశారు. అన్ని బ్రాంచ్‌ల అభ్యర్థులకు కామన్‌గా ఉండే పేపర్-1 (జనరల్ స్టడీస్)లో పేర్కొన్న అంశాలే ఇందుకు నిదర్శనం. మొత్తం పది అంశాలుగా పేర్కొన్న ఈ పేపర్‌లో ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వంటి బేసిక్ ఇంజనీరింగ్ అంశాలతోపాటు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ టూల్స్ వినియోగం, ఈ-గవర్నెన్స్, టెక్నాలజీ ఆధారిత ఎడ్యుకేషన్ వంటి సామాజిక కోణం ఉన్న ఇంజనీరింగ్ అంశాలను చేర్చారు.
ఎథిక్స్.. ఎంతో ప్రత్యేకం
ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కొత్త విధానంలో ప్రత్యేకంగా ప్రస్తావించదగ్గ అంశం జనరల్ స్టడీస్ (పేపర్-1)లో ఇంజనీరింగ్ వృత్తిలో నైతికత, విలువలు అనే అంశాన్ని చేర్చడం. ఐఈఎస్‌కు ఎంపికైన అభ్యర్థులు ఇంజనీరింగ్ విభాగాల్లోనే పని చేస్తారు. కానీ వారు నిర్వర్తించే విధులు సమాజంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపుతాయి. ఈ దృష్టితో ఆలోచించే నైతికత, విలువలు అంశాలు చేర్చి ఉంటారని నిపుణుల అభిప్రాయం.
ఇంగ్లిష్ లేనట్టే!
పేపర్-1లో కొత్త ప్యాట్రన్‌కు సంబంధించి అభ్యర్థులకు బాగా కలిసొచ్చే అంశం జనరల్ ఇంగ్లిష్ విభాగాన్ని తొలగించడం. ప్రస్తుత విధానంలో పేపర్-1 పార్ట్-ఎలో జనరల్ ఇంగ్లిష్ సబ్జెక్ట్ ప్రశ్నలు ఉన్నాయి. కానీ యూపీఎస్‌సీ తాజాగా ప్రకటించిన విధానం, సిలబస్‌లో ఇంగ్లిష్ గురించి ఎక్కడా పేర్కోలేదు. ఈ పేపర్‌లో మొత్తం పది అంశాలను సిలబస్‌గా, ప్రతి అంశానికి లభించే వెయిటేజీ సగటు (5 నుంచి 15 శాతం)ను సైతం విడుదల చేసిన యూపీఎస్‌సీ జనరల్ ఇంగ్లిష్ ప్రస్తావన తీసుకురాలేదు.
సబ్జెక్ట్ సిలబస్ పరిధి విస్తృతం
కొత్త విధానంలో ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధిత పేపర్ల సంఖ్యను నాలుగు నుంచి మూడుకు తగ్గించినప్పటికీ సిలబస్ పరిధి మాత్రం విస్తృతమైంది. కన్వెన్షనల్ విధానంలో ఉండే ఈ పేపర్లలో అన్ని విభాగాల్లోనూ కొత్త అంశాలు చేరాయి. ఉదాహరణకు సివిల్ ఇంజనీరింగ్‌లో కొత్తగా జియో టెక్నికల్ ఇంజనీరింగ్, జియాలజీ వంటి కొత్త అంశాలను పొందుపర్చారు. అదే విధంగా మెకానికల్ ఇంజనీరింగ్‌లో రెన్యువబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, మెకట్రానిక్స్ అండ్ రోబోటిక్స్ వంటి అంశాలను ప్రత్యేక అంశాలుగా పేర్కొన్నారు. అదే విధంగా ఎలక్ట్రానిక్స్‌లో కంప్యూటర్ ఫండమెంటల్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంశాలను ప్రత్యేక విభాగాలుగా పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికం విభాగంలోనూ కొత్త అంశాలు చేర్చడం జరిగింది. అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్ టాపిక్స్, టూల్స్ వంటివి ఇందుకు ఉదాహరణ. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మార్పులు కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్‌ను మరింత క్షుణ్నంగా పరీక్షించే విధంగా ఉన్నాయి. ఉదాహరణకు ప్రస్తుత విధానంలో మెజర్‌మెంట్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ అంశాన్ని విస్తృతం చేసి కొత్త విధానంలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెజర్‌మెంట్స్‌గా పేర్కొన్నారు. అదే విధంగా కంప్యూటర్ ఫండమెంటల్స్ అనే కొత్త టాపిక్‌ను పొందుపర్చారు.
పెరిగిన మార్కులు.. పరీక్ష సమయం
కొత్త విధానంలో ఆయా పేపర్లకు కేటాయించిన మార్కులు ప్రస్తుత విధానం కంటే వంద మార్కుల చొప్పున పెరిగాయి. దీనికి తగ్గట్టుగా వాటికి కేటాయించిన సమయం కూడా పెంచారు. దీన్నిబట్టి సబ్జెక్ట్ పేపర్ల పరంగా అభ్యర్థుల్లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్‌డ్ టాపిక్స్ వరకు పూర్తి స్థాయి అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని అంశాలు ఎంటెక్ ప్రథమ సంవత్సరం స్థాయిలో ఉన్నాయని చెబుతున్నారు. జియో టెక్నాలజీనే దీన్ని ఉదాహరణగా చూపుతున్నారు.
తుది జాబితా రూపకల్పనలోనూ..
తుది జాబితా రూపొందించి ఆయా సర్వీసులకు ఎంపికైన అభ్యర్థులను ప్రకటించేందుకు కూడా యూపీఎస్సీ కొత్త విధానం అమలు చేయనుంది. స్టేజ్-1లో కనీస అర్హత మార్కులు పొందిన అభ్యర్థులనే స్టేజ్-2లో ఉండే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ పేపర్లకు అనుమతించనుంది. ఆ తర్వాత దశలో ఎంపిక ప్రక్రియలో చివరిదైన ఇంటర్వ్యూకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసేందుకు స్టేజ్-1, స్టేజ్-2లలో పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకోనుంది. ఇంటర్వ్యూలు కూడా ముగిశాక అర్హత పరీక్షగా పేర్కొన్న స్టేజ్-1లో పొందిన మార్కులు; అదే విధంగా స్టేజ్-2లో పొందిన మార్కులు; ఇంటర్వ్యూలో పొందిన మార్కుల ఆధారంగా విజేతల జాబితా ప్రకటించనుంది. దీని ప్రకారం మొత్తం 1300 మార్కులకుగాను అందుబాటులో ఉన్న ఖాళీల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.
తగ్గిన పేపర్లు.. పెరిగిన మార్కులు
2017 నుంచి అమలు కానున్న ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కొత్త విధానంలో పేపర్ల సంఖ్య తగ్గింది. అయితే ఇదే సమయంలో మొత్తం మార్కుల సంఖ్య పెరిగింది. ఆ వివరాలు..
కొత్త విధానం
స్టేజ్-1 (ఆబ్జెక్టివ్ విధానం)
పేపర్ | సబ్జెక్ట్ | మార్కులు |
పేపర్-1 | జనరల్ స్టడీస్ | 200 |
పేపర్-2 | ఇంజనీరింగ్ సబ్జెక్ట్ | 300 |
స్టేజ్-2 (కన్వెన్షల్ విధానం)
పేపర్ | సబ్జెక్ట్ | మార్కులు |
పేపర్-1 | ఇంజనీరింగ్ సబ్జెక్ట్ | 300 |
పేపర్-2 | ఇంజనీరింగ్ సబ్జెక్ట్ | 300 |
స్టేజ్-3
ఇంటర్వ్యూ | 200 |
మొత్తం మార్కులు (స్టేజ్1+స్టేజ్2+స్టేజ్3) | 1300 |
ఐఈఎస్ ప్రస్తుత విధానం
సెక్షన్-1 (ఆబ్జెక్టివ్ పరీక్ష)
పేపర్ | సబ్జెక్ట్ | మార్కులు |
పేపర్-1 | జనరల్ ఎబిలిటీ | 200 |
సబ్జెక్ట్ పేపర్ | పేపర్-1 | 200 |
సబ్జెక్ట్ పేపర్ | పేపర్-2 | 200 |
సెక్షన్-2(కన్వెన్షనల్ విధానం)
పేపర్ | సబ్జెక్ట్ | మార్కులు |
పేపర్-1 | ఇంజనీరింగ్ సబ్జెక్ట్ | 200 |
పేపర్-2 | ఇంజనీరింగ్ సబ్జెక్ట్ | 200 |
మొత్తం రాత పరీక్ష మార్కులు | 1000 |
తుది దశ ఇంటర్వ్యూ | 200 |
మొత్తం | 1200 |
సేవా దృక్పథానికి ప్రాధాన్యం
ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్షలో మారిన విధానం ప్రకారం అభ్యర్థుల్లో సబ్జెక్టు నైపుణ్యాలతోపాటు సేవా దృక్పథం పరీక్షిస్తారు. అభ్యర్థులు తమ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ స్కిల్స్‌ను సామాజిక అభివృద్ధికి అన్వయించగలిగే నైపుణ్యాలను పరీక్షించేందుకు పెద్దపీట వేశారు. అన్ని బ్రాంచ్‌ల అభ్యర్థులకు కామన్‌గా ఉండే పేపర్-1 (జనరల్ స్టడీస్)లో పేర్కొన్న అంశాలే ఇందుకు నిదర్శనం. మొత్తం పది అంశాలుగా పేర్కొన్న ఈ పేపర్‌లో ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వంటి బేసిక్ ఇంజనీరింగ్ అంశాలతోపాటు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ టూల్స్ వినియోగం, ఈ-గవర్నెన్స్, టెక్నాలజీ ఆధారిత ఎడ్యుకేషన్ వంటి సామాజిక కోణం ఉన్న ఇంజనీరింగ్ అంశాలను చేర్చారు.
ఎథిక్స్.. ఎంతో ప్రత్యేకం
ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కొత్త విధానంలో ప్రత్యేకంగా ప్రస్తావించదగ్గ అంశం జనరల్ స్టడీస్ (పేపర్-1)లో ఇంజనీరింగ్ వృత్తిలో నైతికత, విలువలు అనే అంశాన్ని చేర్చడం. ఐఈఎస్‌కు ఎంపికైన అభ్యర్థులు ఇంజనీరింగ్ విభాగాల్లోనే పని చేస్తారు. కానీ వారు నిర్వర్తించే విధులు సమాజంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపుతాయి. ఈ దృష్టితో ఆలోచించే నైతికత, విలువలు అంశాలు చేర్చి ఉంటారని నిపుణుల అభిప్రాయం.
ఇంగ్లిష్ లేనట్టే!
పేపర్-1లో కొత్త ప్యాట్రన్‌కు సంబంధించి అభ్యర్థులకు బాగా కలిసొచ్చే అంశం జనరల్ ఇంగ్లిష్ విభాగాన్ని తొలగించడం. ప్రస్తుత విధానంలో పేపర్-1 పార్ట్-ఎలో జనరల్ ఇంగ్లిష్ సబ్జెక్ట్ ప్రశ్నలు ఉన్నాయి. కానీ యూపీఎస్‌సీ తాజాగా ప్రకటించిన విధానం, సిలబస్‌లో ఇంగ్లిష్ గురించి ఎక్కడా పేర్కోలేదు. ఈ పేపర్‌లో మొత్తం పది అంశాలను సిలబస్‌గా, ప్రతి అంశానికి లభించే వెయిటేజీ సగటు (5 నుంచి 15 శాతం)ను సైతం విడుదల చేసిన యూపీఎస్‌సీ జనరల్ ఇంగ్లిష్ ప్రస్తావన తీసుకురాలేదు.
సబ్జెక్ట్ సిలబస్ పరిధి విస్తృతం
కొత్త విధానంలో ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధిత పేపర్ల సంఖ్యను నాలుగు నుంచి మూడుకు తగ్గించినప్పటికీ సిలబస్ పరిధి మాత్రం విస్తృతమైంది. కన్వెన్షనల్ విధానంలో ఉండే ఈ పేపర్లలో అన్ని విభాగాల్లోనూ కొత్త అంశాలు చేరాయి. ఉదాహరణకు సివిల్ ఇంజనీరింగ్‌లో కొత్తగా జియో టెక్నికల్ ఇంజనీరింగ్, జియాలజీ వంటి కొత్త అంశాలను పొందుపర్చారు. అదే విధంగా మెకానికల్ ఇంజనీరింగ్‌లో రెన్యువబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, మెకట్రానిక్స్ అండ్ రోబోటిక్స్ వంటి అంశాలను ప్రత్యేక అంశాలుగా పేర్కొన్నారు. అదే విధంగా ఎలక్ట్రానిక్స్‌లో కంప్యూటర్ ఫండమెంటల్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంశాలను ప్రత్యేక విభాగాలుగా పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికం విభాగంలోనూ కొత్త అంశాలు చేర్చడం జరిగింది. అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్ టాపిక్స్, టూల్స్ వంటివి ఇందుకు ఉదాహరణ. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మార్పులు కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్‌ను మరింత క్షుణ్నంగా పరీక్షించే విధంగా ఉన్నాయి. ఉదాహరణకు ప్రస్తుత విధానంలో మెజర్‌మెంట్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ అంశాన్ని విస్తృతం చేసి కొత్త విధానంలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెజర్‌మెంట్స్‌గా పేర్కొన్నారు. అదే విధంగా కంప్యూటర్ ఫండమెంటల్స్ అనే కొత్త టాపిక్‌ను పొందుపర్చారు.
పెరిగిన మార్కులు.. పరీక్ష సమయం
కొత్త విధానంలో ఆయా పేపర్లకు కేటాయించిన మార్కులు ప్రస్తుత విధానం కంటే వంద మార్కుల చొప్పున పెరిగాయి. దీనికి తగ్గట్టుగా వాటికి కేటాయించిన సమయం కూడా పెంచారు. దీన్నిబట్టి సబ్జెక్ట్ పేపర్ల పరంగా అభ్యర్థుల్లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్‌డ్ టాపిక్స్ వరకు పూర్తి స్థాయి అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని అంశాలు ఎంటెక్ ప్రథమ సంవత్సరం స్థాయిలో ఉన్నాయని చెబుతున్నారు. జియో టెక్నాలజీనే దీన్ని ఉదాహరణగా చూపుతున్నారు.
తుది జాబితా రూపకల్పనలోనూ..
తుది జాబితా రూపొందించి ఆయా సర్వీసులకు ఎంపికైన అభ్యర్థులను ప్రకటించేందుకు కూడా యూపీఎస్సీ కొత్త విధానం అమలు చేయనుంది. స్టేజ్-1లో కనీస అర్హత మార్కులు పొందిన అభ్యర్థులనే స్టేజ్-2లో ఉండే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ పేపర్లకు అనుమతించనుంది. ఆ తర్వాత దశలో ఎంపిక ప్రక్రియలో చివరిదైన ఇంటర్వ్యూకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసేందుకు స్టేజ్-1, స్టేజ్-2లలో పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకోనుంది. ఇంటర్వ్యూలు కూడా ముగిశాక అర్హత పరీక్షగా పేర్కొన్న స్టేజ్-1లో పొందిన మార్కులు; అదే విధంగా స్టేజ్-2లో పొందిన మార్కులు; ఇంటర్వ్యూలో పొందిన మార్కుల ఆధారంగా విజేతల జాబితా ప్రకటించనుంది. దీని ప్రకారం మొత్తం 1300 మార్కులకుగాను అందుబాటులో ఉన్న ఖాళీల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.
క్లిష్టతస్థాయి పెరగనుంది యూపీఎస్‌సీ విడుదల చేసిన ఇంజనీరింగ్ సర్వీసెస్ కొత్త ఎంపిక విధానం, పొందుపరచిన సిలబస్ అంశాలను పరిశీలిస్తే ఇక నుంచి ఈ పరీక్ష క్లిష్టత స్థాయి పెరగనుందని అవగతమవుతోంది. ముఖ్యంగా సబ్జెక్ట్ నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇస్తూ వాటికి మార్కులు పెంచడంతోపాటు, ఆ సబ్జెక్ట్ నైపుణ్యాలను సోషల్ అప్లికేషన్‌లో వినియోగించే సామర్థ్యాన్ని ప్రశ్నించే విధంగానూ సిలబస్ ఉంది. దీంతో అభ్యర్థులు ఇటు సబ్జెక్ట్‌పైనా, అటు వాటి ఆధారంగా ఉన్న సామాజిక అనువర్తనాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుత విధానంలో గేట్, ఇతర ప్రవేశ పరీక్షల స్థాయి ప్రిపరేషన్‌తో సమానంగా ఐఈఎస్‌కు సన్నద్ధమయ్యే అవకాశం ఉంది. కానీ కొత్త విధానంలో ప్రత్యేక సమయం కేటాయించాల్సి ఉంటుంది. - వై.వి.గోపాల కృష్ణ, ఏస్ అకాడమీ. |
ఆందోళన చెందక్కర్లేదు ఐఈఎస్-2017 నుంచి అమలు కానున్న కొత్త విధానం వల్ల బీటెక్ విద్యార్థుల్లో ఆందోళన పెరిగిందనే అభిప్రాయాలు వాస్తవమే. దీనికి కారణం ప్రస్తుతం విధానంలో పరీక్షకు హాజరయ్యే వారిలో బీటెక్ చివరి సంవత్సరం చదివే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కొత్త విధానంలో సిలబస్ క్లిష్టంగా ఉందని, సమయం సరిపోదనే ఆందోళన వారిలో నెలకొంది. ఐఈఎస్ పరీక్ష సాధారణంగా ప్రతి ఏటా మే/జూన్ నెలల్లో జరుగుతుంది. దీని ప్రకారం కొత్త విధానంలో ఐఈఎస్-2017 పరీక్ష మే/జూన్ 2017లో జరిగే ఆస్కారం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే అభ్యర్థులకు కొత్త విధానంలో ప్రిపేర్ కావడానికి ఏడాదికిపైగా సమయం ఉంది. సిలబస్‌లోని అన్ని అంశాలు బేసిక్స్ ఆధారంగానే ఉన్నాయి. కాబట్టి బీటెక్ విద్యార్థులు ఆందోళన చెందకుండా క్రమబద్ధంగా ప్రిపరేషన్ సాగిస్తే విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు. బీటెక్ సిలబస్ పరిధిలో ఉన్న అంశాలపై పూర్తి స్థాయి పట్టు సాధిస్తే అంతకుమించిన స్థాయిలో ఉన్న అంశాల గురించి ఆందోళన చెందక్కర్లేదు. - కె.వెంకటేశ్వరరెడ్డి, కోఆర్డినేటర్, మేడ్ ఈజీ అకాడమీ. |
#Tags