విదేశాల్లో మాస్టర్స్ చదవాలనుకుంటున్నారా.. అయితే ఈ సమాచారం మీకోసమే..
లేక ఎంబీఏ మంచిదా? అని!! ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు విదేశాల్లో ఎంబీఏ వర్సెస్ ఎంఎస్ అనేది క్లిష్టంగా మారుతోంది. రెండూ అద్భుత అవకాశాలను, అధిక వేతనాలను అందించే కోర్సులేనని నిపుణులు పేర్కొంటున్నారు! కానీ, ఇవి పూర్తిగా భిన్నమైన కెరీర్స్‌ను అందించే కోర్సులు. త్వరలో బీటెక్ పూర్తి చేసుకొని విదేశీ విద్యకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడేలా.. ఎంబీఏ, ఎంఎస్ కోర్సులు, వాటి తీరుతెన్నులు, ప్రవేశ విధానం, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక కథనం...
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు విదేశీ విద్యకు వెళ్లేటప్పుడు ఎంబీఏ,ఎంఎస్‌ల్లో.. ఏదో ఒకదాన్ని ఎంచు కోవాల్సివచ్చినప్పుడు తికమకపడుతుంటారు. ఈ రెండు కోర్సులూ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉజ్వల అవకాశాలను అందిస్తుండటంతో ఎంపిక కష్టతరమవుతోంది. ఇలాంటి సందర్భంలో రెండు కోర్సులు–కెరీర్ అవకాశాలను పరిశీ లించడంతోపాటు తమకు ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా కోర్సు ఎంపికపై ఓ స్థిర నిర్ణయానికి రావొచ్చు.
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ).. మాస్టర్ ఆఫ్ సైన్స్(ఎంఎస్)...రెండూ మంచి కెరీర్ అందించే టాప్ కోర్సులే. అంతేకాదు ఇవి ఖర్చుతో కూడుకున్న కోర్సులు కూడా! వీటిలో ఎంబీఏ విదేశీ వర్సిటీలతోపాటు మన దేశం లోనూ అందుబాటులో ఉంది. విదేశీ ఎంఎస్‌కు సరితూగే ఎంటెక్/ఎమ్మెస్సీలను భారతీయ యూనివర్సిటీలు/ఇన్‌స్టిట్యూట్‌లు అందిస్తున్నాయి. కాగా, ఈ రెండింటిలో ఒక దాన్ని ఎంచుకొనే క్రమంలో.. విద్యార్థి ఎందులో చేరితే గరిష్ట లబ్ధి పొందుతాడు అనేది కీలక అంశంగా నిలుస్తుంది. కోర్సును పూర్తి చేసేందుకు అయ్యే ఖర్చు, కెరీర్ స్కోప్, ఉద్యోగ అవకాశాలు, స్వీయ ఆసక్తులను పరిగణలోకి తీసుకోవాలి.
ఎంబీఏ–కార్పొరేట్ కెరీర్..
ఇది కార్పొరేట్ రంగంలో కెరీర్‌కు మార్గం వేసే కోర్సు. ఎంబీఏ ప్రస్తుతం రెండేళ్ల ఫుల్‌టైమ్ ఎంబీఏతోపాటు పార్ట్‌టైమ్ ఎం బీఏ,ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎంబీఏలో ఫైనాన్స్, మార్కెటింగ్, హుమాన్ రిసోర్సెస్, అకౌంటింగ్, ఎకనామిక్స్ తదితర సబ్జెక్టులను అధ్యయనం చేస్తారు. కార్పొరేట్ రంగంలో కెరీర్‌ను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఎంబీఏ సరైన ఎంపిక. ప్రస్తుతం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో ఎక్కువమంది ఎంబీఏ వైపు మొగ్గు చూపుతున్నారు. విదేశీ వర్సిటీల్లో ఎంబీఏకు కనీసం గ్రాడ్యు యేషన్‌తోపాటు అనుభవం ఉంటే మేలు.
స్పెషలైజేషన్స్..
ఎంబీఏ ఎంతో వైవిధ్యభరితమైన కోర్సు. జనరల్ ఎంబీఏలో అభ్యర్థులు తమ ఇష్టాల మేరకు స్పెషలైజేషన్స్‌ను ఎంచుకో వచ్చు. వర్సిటీలు సైతం పరిశ్రమలు, మార్కెట్ అవసరాలకు తగ్గట్టు ఏటా కొత్త స్పెషలైజేషన్స్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. ప్రస్తుతం ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్‌ఆర్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, హాస్పిటాలిటీ వంటి ఎన్నో స్పెషలైజేషన్స్ ఎంచుకునే అవకాశం ఉంది.
ఇంకా చదవండి: part 2: విదేశాల్లో ఎంబీఏ ప్రవేశం ఇలా.. టాప్ ఇన్‌స్టిట్యూట్స్ ఇవే...