మూక్స్ విధానంలో సాధించిన క్రెడిట్స్ సైతం బదిలీకి అవకాశం..

ప్రస్తుతం మన విద్యార్థులకు రెగ్యులర్ కోర్సులతోపాటు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్‌పీటీఈఎల్, స్వయం వంటి పోర్టల్స్ ద్వారా.. పలు ఆన్‌లైన్ కోర్సులు మూక్స్ విధానంలో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఇలా

ఆన్‌లైన్, మూక్స్ ద్వారా ఏదైనా ఒక కోర్సులో చేరి.. సంపాదించిన క్రెడిట్స్‌ను కూడా విద్యార్థులు కొత్తగా చేరనున్న కోర్సులకు జమ చేస్తారు. ఫలితంగా విద్యార్థులు కొత్తగా చేరే కోర్సు విషయంలో.. చదవాల్సిన సబ్జెక్ట్‌ల సంఖ్య తగ్గే వెసులుబాటు లభించనుంది.

  1. అకడమిక్ క్రెడిట్ బ్యాంక్ విధానాన్ని ఇంజనీరింగ్, మెడికల్, లా తదితర ప్రొఫెషనల్ కోర్సులకు సైతం వర్తింపజేయనున్నారు. అయితే ఏఐసీటీఈ, ఎన్‌ఎంసీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాల ఆమోదం పొందిన కోర్సుల విద్యార్థుల క్రెడిట్స్‌నే అకడమిక్ క్రెడిట్ బ్యాంక్‌లో నిక్షిప్తం చేస్తారు.

ఇంకా చదవండి: part 4: ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనే విద్యార్థులకు సైతం ప్రయోజనం..