డిజిటల్‌ తరగతుల కోసం తక్కువ కాలంలో.. విద్యార్థులు వీటి గురించి తెలుసుకోవాల్సిందే..

ఉపాధ్యాయులు, విద్యార్థులు.. జూమ్, క్లాస్‌రూమ్, వెబెక్స్‌ వంటి యాప్స్‌ను ఎలా ఉపయోగించాలో తక్కువ కాలంలోనే నేర్చుకోవాల్సి వచ్చింది.
స్కూలు ఓ చోట.. ఉపాధ్యాయులు మరోచోట.. విద్యార్థులు ఇళ్లల్లో ఉన్నా.. అందరూ యాప్స్‌ ద్వారా కనెక్ట్‌ అవుతున్నారు. విద్యాసంస్థల అడ్మినిస్ట్రేషన్‌ సైతం ఆన్‌లైన్‌లోనే సాగుతోంది. ఉపాధ్యాయుల విధులు, విద్యార్థుల టైం టేబుల్, ఫీజులు, జీతాల చెల్లింపు లావాదేవీలు అన్నీ డిజిటలైజ్‌ అవుతున్నాయి. విద్యార్థుల డేటాను భద్రపరచడానికి పాఠశాలలు, కళాశాలలు.. ప్రతి విద్యార్థి వివరాలను, సర్టిఫికెట్లను సైతం కంప్యూటరీకరిస్తున్నాయి. అంటే.. ఎవరూ స్కూలుకు రాకుండానే తమతమ విధులను ఉన్నచోట నుంచే నిర్వహించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ ఆరు నెలల వ్యవధిలోనే సంభవించడం విశేషం.

స్మార్ట్‌ స్కిల్స్‌..
కొవిడ్‌ కారణంగా ప్రతి ఒక్కరూ డిజిటల్‌ టెక్నాలజీని నేర్చుకోవాల్సి వచ్చింది. కొత్త మార్పును త్వరగా వంటపట్టించుకునేందుకు ఇష్టపడని వారు సైతం ఇప్పుడు స్మార్ట్‌ స్కిల్స్‌ను అందిపుచ్చుకుంటున్నారు. మెకిన్సే గ్లోబల్‌ సర్వే–2020 ప్రకారం–87శాతం కార్పొరేట్లు తమ మానవ వనరుల నైపుణ్యాలలో టెక్నాలజీ పరంగా వ్యత్యాసం ఉందని అంగీకరించాయి. సాధారణ పరిస్థితుల్లో ఇలాంటి వారిలో టెక్నాలజీ అంతరం తగ్గించేందుకు కొన్నేళ్లు పట్టేది. కానీ, ఇప్పుడు సిబ్బంది అత్యంత వేగంగా స్మార్ట్‌ స్కిల్స్‌పై అవగాహన పెంచుకుంటున్నారు. ఇకపై ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు, ఇప్పటికే కొలువుల్లో ఉన్న సీనియర్లు సైతం తమ కెరీర్‌ కోసం అప్‌స్కిల్లింగ్‌ అవసరమని గ్రహించారు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే.. ఖాళీ సమయంలో మూక్స్‌ వంటి డిజిటల్‌ వేదికల ద్వారా స్కిల్స్‌పై శిక్షణ పొందుతున్నారు.

ఇంకా చదవండి: part 4: డిజిటల్‌ తరగతుల కోసం తక్కువ కాలంలో.. విద్యార్థులు వీటి గురించి తెలుసుకోవాల్సిందే..