బీమా రంగంలో ఖచ్చితమైన కొలువుకు ఉపయోగపడే ఏసెట్ మార్చి-2021 నోటిఫికేషన్ విడుదల.. సిలబస్ ఇలా..

బీమా నష్టాల విలువను లెక్కించి.. పాలసీలకు రూపకల్పన చేయడంతోపాటు వాటి ధరలను నిర్ణరుుంచే వారిని ‘యాక్చువరీస్’గా పేర్కొంటారు. వీరికి బీమా రంగంలో ఫైనాన్‌‌స మోడలింగ్, రిస్క్ విశ్లేషణలో నైపుణ్యం ఉంటుంది.

ఎవరైనా ‘సర్టిఫైడ్ యాక్చువరీస్’గా గుర్తింపు పొందాలంటే.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చువరీస్ ఆఫ్ ఇం డియా(ఐఏఐ) నిర్వహించే ‘ఏసెట్’లో అర్హత సాధించాలి. ఏసెట్-2021(యాక్చు వరీస్ కామన్ ఎంట్రన్స్‌ టెస్ట్) నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో.. పూర్తి వివరాలు..

బీమా రంగం కీలక పాత్ర..
జీవిత బీమా, సాధారణ బీమా వ్యాపారంలో యాక్చువరీస్ కీలక పాత్ర పోషిస్తుంది. పాలసీల రూపకల్పన, ధర నిర్ణయించడం, వాగ్దానం చేసిన ప్రయోజనాలను అందించడానికి అవసరమైన నిధులను పర్యవేక్షించడం, బోనస్ రేటును సిఫార్సు చేయడం, బీమా వ్యాపారం విలువ, సాల్వెన్సీ మార్జిన్, ఇతర బీమా నష్టాలను నిర్థారించడం వంటి బాధ్యతలు చూస్తుంటారు. వసూలు చేయాల్సిన ప్రీమియంపై సలహా ఇవ్వడం, క్లెయిమ్‌లరిజర్వ్ లెక్కించడం, ఫైనాన్షియల్ మోడలింగ్‌ను నిర్వహించడం.. వీరి ప్రధాన విధులు. ఇటీవల కాలంలో బీమా రంగం విస్తరణతో యాక్చువరీస్ ప్రాధాన్యం పెరిగింది. మన దేశంలో ప్రొఫెషనల్ యాక్చువరీస్ నియంత్రణ సంస్థ.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చువరీస్ ఆఫ్ ఇండియా (ఐఏఐ).

మార్చిలో ఎంట్రన్స్‌ టెస్ట్..
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చువరీస్ ఆఫ్ ఇండియా (ఐఏఐ).. ఏటా రెండుసార్లు ఎంట్రన్స్‌ నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఏసీఈటీ(ఏసెట్)-2021, మార్చి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ యాక్చురియల్ కామన్ ఎంట్రన్స్‌ టెస్ట్ ద్వారా.. వివిధ జాతీయ సంస్థలు అందించే యాక్చువరీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం కల్పిస్తారు.

అర్హతలు..

  1. ఇంటర్మీడియెట్(10+2) కనీస అర్హత, ఇంగ్లిష్ తప్పనిసరిగా చదివి ఉండాలి. డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ, సీఏ వంటి కోర్సులు చేసినవారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.
  2. పవేశ పరీక్ష రాసేందుకు అభ్యర్థులకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు.
  3. కోవిడ్ నేపథ్యంలో ఈసారి హోమ్‌బేస్డ్ ఎంట్రన్‌‌స నిర్వహించనున్నారు.


పరీక్ష విధానం..
ఏసెట్ ఎంట్రన్‌‌స పూర్తిగా ఇంగ్లిష్‌లో ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. అభ్యర్థులు మూడు గంటల సమయంలో 70 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. వీటిలో 45 ఒక మార్కు ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ప్రతి తప్పు సమాధానానికి 0.5 మార్కులు తగ్గిస్తారు. అలాగే రెండు మార్కుల ప్రశ్నలు 20 ఉంటాయి, వీటిలో ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. ఐదు మూడు మార్కుల ప్రశ్నలు ఉంటాయి. తప్పు సమాధానికి 1.5 మార్కులు కోత విధిస్తారు. మొత్తం ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు.

ఏసెట్ సిలబస్..

  1. బ్యాంక్ టెస్టుల మాదిరిగానే ఈ సిలబస్ ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, మ్యాథమెటిక్స్, లాజికల్ రీజనింగ్, స్టాటిస్టిక్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్ విభాగం నుంచి వచ్చే ప్రశ్నలకు 25 మార్కులు,75 మార్కులు ఇతర విభాగాల ప్రశ్నలకు కేటాయించారు.
  2. లాజికల్ రీజనింగ్: ఆల్ఫాబెట్ అండ్ నంబర్ సిరీస్, ఫ్యామిలీ అండ్ సర్క్యులర్ అరేంజ్‌మెంట్, లాజికల్ కనెక్టివిటీ, కోడింగ్ అండ్ డీకోడింగ్, డెరైక్షన్‌‌స, పజిల్స్, క్లాక్ అండ్ కేలండర్, క్యూబ్స్, స్టేట్‌మెంట్ కంక్లూజన్‌‌స విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
  3. స్టాటిస్టిక్స్: పెర్ముటేషన్‌‌స అండ్ కాంబినేషన్స్‌, ప్రాబబిలిటీస్, టైప్స్ ఆఫ్ డేటా, మెజర్స్ ఆఫ్ లొకేషన్ అండ్ స్ప్రెడ్, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్‌‌స, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్‌, కోరిలేషన్ అండ్ రిగ్రెషన్.
  4. మ్యాథమెటిక్స్: న్యూమరికల్ మెథడ్‌‌స, నొటేషన్ అండ్ స్టాండర్డ్ ఫంక్షన్స్‌, ఇంటెగ్రేషన్, ఆల్జీబ్రా, డిఫరెన్షియేషన్, వెక్టర్స్, మాట్రిక్స్ మొదలైనవి.
  5. ఇంగ్లిష్: వొకాబ్యులరీ, గ్రామర్ యూసేజ్, సెంటెన్‌‌స కరెక్షన్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, క్లోజ్ పాసేజ్, వెర్బల్ రీజనింగ్ మొదలైనవి.
  6. డేటా ఇంటర్‌ప్రిటేషన్: టేబుల్స్, లైన్ చార్ట్, కోలమ్ గ్రాఫ్స్, బార్ గ్రాఫ్స్, పై చార్ట్, వెన్ డయాగ్రమ్స్ మొదలైన విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.


ఇంకా చదవండి: part 2: సర్టిఫైడ్ యాక్చువరీస్’గా గుర్తింపు పొందేందుకు.. మూడు స్థాయిల్లో పరీక్షలు..