ఐఈఎస్ నోటిఫీకేష‌న్ విడుద‌ల‌.. అర్హత‌లివిగో..

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ).. ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌–2020 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అక్టోబరు 16 నుంచి రాత పరీక్షలను నిర్వహించనుంది.

ఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉపయోగపడేలా ఐఈఎస్‌ పరీక్ష స్వరూపం, సిలబస్‌కు సంబంధించిన వివరాలు..

  1.  పరీక్ష: ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌–2020
  2.  భర్తీ చేయనున్న మొత్తం పోస్టుల సంఖ్య: 15

అర్హతలు..

  1.  అప్లయిడ్‌ ఎకనామిక్స్‌/ఎకనామిట్రిక్స్‌/ఎకనామిక్స్‌/బిజినెస్‌ ఎకనామిక్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.
  2.  వయసు: 21 ఏళ్లనుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్ల వయో సడలింపు లభిస్తుంది.
  3.  ఎంపిక విధానం: రాత పరీక్ష, వైవా వోస్‌ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. రాత పరీక్షకు 1000 మార్కులు, వైవా వోస్‌కు 200 మార్కులు కేటాయించారు.

పరీక్ష విధానం..

ఐఈఎస్‌ పరీక్ష విధానంలో రాత పరీక్ష, ఇంటర్వూలు ఉంటాయి. రాత పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులను ఇంటర్వూకి ఆహ్వానిస్తారు.

రాత పరీక్ష..

రాత పరీక్షను వ్యాసరూప విధానంలో నిర్వహిస్తారు. మొత్తం ఆరు పేపర్లు ఉంటాయి.

పేపర్‌ సబ్జెక్టు మార్కులు సమయం
1 జనరల్‌ ఇంగ్లిష్‌ 100 3 గం.
2 జనరల్‌ స్టడీస్‌ 100 3 గం.
3 జనరల్‌ ఎకనామిక్స్‌–1 200 3 గం.
4 జనరల్‌ ఎకనామిక్స్‌–2 200 3 గం.
5 జనరల్‌ ఎకనామిక్స్‌–2 200 3 గం.
6 ఇండియ‌న్ ఎకనామిక్స్‌ 200 3 గం.

సిలబస్‌..

  1.  జనరల్‌ ఇంగ్లిష్‌: » ఎస్సే రైటింగ్‌ » పాసేజ్‌ » ప్రెసిస్‌ రైటింగ్‌ » పదాల వాడకం వంటివి ఉంటాయి.
  2.  జనరల్‌ స్టడీస్‌: » సమకాలిన అంశాలు » భారతీయ రాజకీయాలు » భారతదేశ చరిత్ర » భౌగోళిక స్వరూపంపై దృష్టిపెట్టాలి.

జనరల్‌ ఎకనామిక్స్‌ పేపర్‌ 1:

 పార్ట్‌ ఎ: వినియోగదారుల డిమాండ్‌ సిద్ధాంతం, ఉత్పత్తి సిద్ధాంతం, విలువ సిద్ధాంతం, పంపిణీ సిద్ధాంతం, సంక్షేమ ఆర్థిక శాస్త్రం. అలాగే పార్ట్‌ బి: ఆర్థికశాస్త్రంలో పరిమాణాత్మక పద్ధతులు ఉంటాయి.

జనరల్‌ ఎకనామిక్స్‌ పేపర్‌ 2:

ఆర్థిక ఆలోచన, జాతీయ ఆదాయ–సామాజిక అకౌంటింగ్‌ భావన, ఉపాధి సిద్ధాంతం, ఔట్‌పుట్, ద్రవ్యోల్బణం, ఆర్థిక, మూలధన మార్కెట్, ఆర్థిక వృద్ధి–అభివృద్ధి, అంతర్జాతీయ ఆర్థిక అంశాలు, చెల్లింపుల బ్యాలెన్స్, అంతర్జాతీయ సంస్థలు.

జనరల్‌ ఎకనామిక్స్‌ పేపర్‌ 3:

పబ్లిక్‌ ఫైనాన్స్, ఎన్విరాన్‌మెంటల్‌ ఆర్థిక శాస్త్రం, పారిశ్రామిక ఆర్థిక శాస్త్రం, రాష్ట్రం, మార్కెట్‌–ప్రణాళిక తదితర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.

ఇండియన్‌ ఎకనామిక్స్‌:

అభివృద్ధి, ప్రణాళిక చరిత్ర, బడ్జెట్, ఆర్థిక విధానం, పేదరికం, నిరుద్యోగం, మానవాభివృద్ధి, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వ్యూహాలు, పట్టణీకరణ, వలసలు–భారతదేశ అనుభవం, పరిశ్రమ, పారిశ్రామిక అభివృద్ధి వ్యూహం, లేబర్, విదేశీ వాణిజ్యం, డబ్బు, బ్యాంకింగ్‌ వంటి అంశాలపై దృష్టి ట్టాలి.

ముఖ్య సమాచారం..

  1.  దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  2.  రఖాస్తు ఫీజు: రూ.200 మహిళలు/ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది)
  3.  దరఖాస్తులకు చివరి తేది: 01.09.2020
  4.  దరఖాస్తుల ఉపసంహరణ: 08.09.2020 నుంచి 14.09.2020 వరకు
  5.  పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in ,                                                    https://www.upsconline.nic.in