పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు రూ.13,877కోట్లు

పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ ప్రభుత్వ పథకాలకు గాను పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిలకు బడ్జెట్‌లో రూ.13,877కోట్లు కేటాయించారు. ఇందులో పంచాయతీరాజ్‌కు కేటాయింపులు రూ.8,641.61కోట్లు కాగా, గ్రామీణాభివృద్ధి విభాగానికి 5,415.45కోట్లు కేటాయించడం విశేషం. పంచాయితీరాజ్ విభాగానికి కేటాయించిన నిధుల్లో రూ.2,860.84కోట్లు ప్రణాళికేతర వ్యయంగానూ, రూ.5,600.77 కోట్లు ప్రణాళిక వ్యయంగానూ చూపారు. గ్రామీణాభివృద్ధికి ప్రణాళిక వ్యయం 5,406.86కోట్లు చూపగా, ప్రణాళికేతర వ్యయంగా చూపింది కేవలం రూ.8.59కోట్లు కావడం గమనార్హం.
  • పంచాయతీరాజ్‌కు కేటాయింపులు..
  • గామాల్లో వివిధ కార్యక్రమాల నిమిత్తం రూ.2,541.36కోట్లు
  • స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థలకు నష్టపరిహారం, ఇతర కేటాయింపుల కింద రూ.26.97కోట్లు
  • ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) పరిధిలో.. ఇతర గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు మరో రూ.294.27 కోట్లు, రూ.3,054 కోట్లు
  • రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.72.10కోట్లు
  • గ్రామీణాభివృద్ధికి కేటాయింపులు..
గ్రామీణాభివృద్ధి శాఖకు బడ్జెట్లో ప్రణాళిక వ్యయం కింద మొత్తం రూ.5,406కోట్లు చూపగా, ఇందులో పెద్ద ఎత్తున వివిధ సామాజిక భద్రతా పింఛన్లు, ఇతర సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.2,374కోట్లు కే టాయించారు.
#Tags