Andhra Pradesh: హెడ్‌సెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తే రూ.20 వేల ఫైన్‌పై క్లారిటీ ఇదే...

రెండు రోజులుగా సోష‌ల్‌మీడియాలో ఒక వార్త వైర‌ల్ అవుతోంది. ఇయర్ ఫోన్స్, హెడ్‌సెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తే రూ.20వేల ఫైన్ అంటూ కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని వ్యాప్తి చేస్తున్నారు. బైక్ మీద వెళ్తున్న స‌మ‌యంలో అలాగే కారు డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే ఆగ‌స్ట్ నుంచి కొత్త ఫైన్ వేయ‌నున్నార‌ని వాట్స‌ప్‌, ఫేస్‌బుక్లో న్యూస్ వైర‌ల్ అవుతోంది. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ రవాణాశాఖ స్పందించి క్లారిటీ ఇచ్చింది.
హెడ్‌సెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తే రూ.20 వేల ఫైన్‌పై క్లారిటీ ఇదే...

ఇవీ చ‌దవండి: ఈ నెంబ‌ర్ల నుంచి కాల్స్‌, మెసేజ్‌లు వస్తే జ‌ర జాగ్ర‌త్త‌.... విద్యార్థులే ల‌క్ష్యంగా పాకిస్తాన్ కుయుక్తులు

ఇయర్ ఫోన్స్, హెడ్‌సెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తే రూ.20వేల జరిమానా వార్త ప‌చ్చి అబ‌ద్ధ‌మ‌ని రవాణాశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కొత్త‌గా ఎలాంటి ఫైన్‌లు అమ‌లు చేయ‌ట్లేద‌ని, కేంద్ర ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల మేర‌కే జ‌రిమానాలు వసూలు చేస్తున్నట్లు రవాణాశాఖ కమిషనర్‌ తెలిపారు. మోటార్‌ వెహికిల్‌ యాక్ట్‌ ప్రకారం ఇయర్ ఫోన్ లేదా హెడ్ ఫోన్ పెట్టుకుని వాహనం నడుపుతూ పట్టుబడితే తొలిసారి రూ. 1500 నుంచి రూ. 2వేలు జరిమానా విధిస్తున్నట్లు చెప్పారు. 

ఇవీ చ‌దవండి: అద‌ర‌గొట్టిన ఐఐఐటీ విద్యార్థి... కోటి 25 ల‌క్ష‌ల ప్యాకేజీతో శ‌భాష్ అనిపించిన అనురాగ్‌

జ‌రిమానా విధించినా వాహ‌న‌దారుల్లో మార్పులేన‌ట్ల‌యితే.. ప‌దే ప‌దే హెడ్‌సెట్ పెట్టుకుని నిర్ల‌క్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే రూ. 10వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని ఆయ‌న‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఈ నిబంధన చాలా కాలంగా అమల్లో ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో చేసే అసత్య ప్రచారాలను వాహనదారులు నమ్మొద్దని సూచించారు. అలాగే త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చారం చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కూడా హెచ్చ‌రించారు.

#Tags