Jobs: నిరుద్యోగులకు శుభవార్త ప్రభుత్వ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు
రాష్ట్రంలో 71 ప్రభుత్వ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ సెప్టెంబర్ 28న నోటిఫికేషన్లు జారీ చేసింది.
ఈ నోటిఫికేషన్లను కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచినట్టు ఏపీపీఎస్‌సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు.
పోస్టులు, దరఖాస్తు తేదీలు ఇలా..
- హార్టీకల్చర్ ఆఫీసర్ పోస్టులు 39. దరఖాస్తులను అక్టోబర్ 11 నుంచి నవంబర్ 2 వరకు సమర్పించవచ్చు. ∙తెలుగు రిపోర్టర్ (లెజిస్లేచర్) పోస్టులు 5. దరఖాస్తులను అక్టోబర్ 18 నుంచి నవంబర్ 8 వరకు స్వీకరిస్తారు.
- ఆయుర్వేద లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 3. దరఖాస్తులను అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 28 వరకు సమర్పించవచ్చు. ∙హోమియో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 24. దరఖాస్తులను అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 28 వరకు స్వీకరిస్తారు.
చదవండి:
#Tags