AP Constable Jobs 2024 : ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు మళ్లీ...?
పీఎంటీ, పీఈటీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి మూడో దశలో తుది రాత పరీక్ష నిర్వహించి ప్రతిభావంతులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తామన్నారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రాథమిక రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు రెండో దశలో దేహదారుఢ్య, శారీరక కొలతల (పీఎంటీ, పీఈటీ) పరీక్షలకు వారం రోజుల్లో దరఖాస్తుల స్వీకరణ మొదలు పెడతామని తెలిపారు. ఈ మొత్తం నియామక ప్రక్రియను 5 నెలలోపే పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.
ఈ 100 మంది హోంగార్డులకు...
ప్రాథమిక రాత పరీక్షలో 95,208 మంది అర్హత సాధించారు. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించని 100 మంది హోంగార్డులు హైకోర్టులో రిట్ పిటిషన్‌లు దాఖలు చేశారు. వారిని తదుపరి దశ పరీక్షలకు అనుమతించాలని న్యాయస్థానం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో న్యాయ సలహా తీసుకుని ఎంపిక ప్రక్రియను ఆగిపోయిన చోట నుంచే మళ్లీ ప్రారంభిస్తున్నామని మంత్రి తెలిపారు.