AP Police Constable Jobs 2024 Update News : 6,100 కానిస్టేబుల్ పోస్టులపై అప్‌డేట్ న్యూస్ ఇదే.. ఈ నియామకాలను...
2023 జనవరి చివరి వారంలో ప్రిలిమ్స్ రాత పరీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 5న ఫలితాలు ప్రకటిస్తూ... 95,208 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. అర్హులైన వారికి దేహదారుఢ్య పరీక్షలు మార్చి 13 నుంచి 20 వరకూ నిర్వహించాల్సి ఉంది. దీనికి సంబంధించి హాల్ టికెట్లు జారీ చేశారు. కానీ.. అదే సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ప్రక్రియను వాయిదా పడింది.
వివాదం మొదలైంది ఇక్కడే..
అయితే.. పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లో సివిల్ హోం గార్డులకు 15 శాతం, ఏపీఎస్పీ హోం గార్డులకు 25 శాతం రిజర్వేషన్ ఇచ్చింది. దాంతో వివాదం మొదలైంది. దీంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆ తర్వాత ఏపీలో ప్రభుత్వ మార్పు జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కానిస్టేబుల్ నియామకాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.
ఆగిన 6,100 పోలీస్ కానిస్టేబుల్ నియామకాలను..
న్యాయనిపుణుల సహకారంతో న్యాయమైన చిక్కులను తప్పించి.. ఆగిన 6,100 పోలీస్ కానిస్టేబుల్ నియామకాలను ముందుకు తీసుకెళ్లేందుకు మార్గం సుగమం అయ్యింది. త్వరలోనే ఫిట్‌నెస్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించడానికి ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఈ ప్రక్రియ ముందుకు సాగుతుందో లేదో అనే అనుమానంలో అభ్యర్థులు ఉన్నారు.