భారత న్యాయ వ్యవస్థ

భారత్‌లో న్యాయ వ్యవస్థ అభివృద్ధిలో కార్‌‌నవాలీస్ ప్రధాన పాత్ర పోషించాడు. ఇతడిని ‘భారత న్యాయ వ్యవస్థ పితామహుడు’గా పేర్కొంటారు. ఈస్ట్ ఇండియా పాలనా కాలంలో 1773లో రూపొందించిన రెగ్యులేటింగ్ చట్టం ద్వారా కలకత్తాలోని ఫోర్‌‌ట విలియమ్స్‌లో 1774లో తొలిసారిగా సుప్రీంకోర్టును స్థాపించారు.

భారత రాజ్యాంగం అయిదో భాగంలో ప్రకరణ 124 నుంచి 147 వరకు సుప్రీంకోర్టు నిర్మాణం, అధికారం, విధుల గురించి పేర్కొన్నారు. భారత ప్రభుత్వ చట్టం-1935 ద్వారా ఫెడరల్ కోర్టును అత్యున్నత న్యాయస్థానంగా ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగం ద్వారా 1950 జనవరి 28న సుప్రీంకోర్టు అమల్లోకి వచ్చింది. అంతకుముందున్న ‘ప్రివి కౌన్సిల్’ (ఇంగ్లండ్‌లో ఉండేది) రద్దయింది. ఇది అత్యున్నత న్యాయస్థానంగా పనిచేసేది.

రాజ్యాంగ పరిషత్తు సభ్యుడు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ సుప్రీంకోర్టును ప్రపంచంలో కెల్లా శక్తివంతమైన న్యాయస్థానంగా వర్ణించారు. "Whence Law, Thence Victory" (ధర్మమే జయిస్తుంది) అనేది సుప్రీంకోర్టు మోటో (Moto). సుప్రీంకోర్టు భవన రూపశిల్పి ‘గణేష్ బికాజీ డియోల్కర్’.

రాష్ట్రంలో అత్యున్నత కోర్టు ‘హైకోర్టు’. 1861 కౌన్సిల్ చట్టం ప్రకారం దేశంలో తొలిసారిగా హైకోర్టును 1862లో కలకత్తాలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మద్రాసు (1862), బొంబాయి (1862) లో ఏర్పాటు చేశారు. కేంద్రపాలిత ప్రాంతాలు సమీప రాష్ట్ర హైకోర్టు పరిధిలోకి వస్తాయి. సొంతంగా హైకోర్టు కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ‘ఢిల్లీ’.









































#Tags