భారత్‌లో శుభ్రమైన రాజధానిగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు-2019కు ఎంపికైన నగరం ఏది?

పట్టణీకరణ
 భారత్‌లో ప్రత్యేకంగా దక్షిణ, పశ్చిమ, నేషనల్ కాపిటల్ ప్రాంతాల్లోని నగరాల్లో ఆర్థిక, జనాభా వృద్ధి కారణంగా పట్టణీకరణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో అనేక అంశాలతో కూడిన  నగర ప్రణాళిక, సమీక్షకు సంబంధించి పట్టణ స్థానిక సంస్థలు నగర ప్రణాళికను రూపొందించుకోవడానికి రాష్ట్రాలు అనుమతించాలని భారత రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్ సూచిస్తుంది. ఈ క్రమంలో పట్టణ స్థానిక సంస్థలు తమ ప్రణాళికా సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవాలి. భారత్‌లో స్వాతంత్య్రానంతరం ప్రైవేటు రంగ అభివృద్ధిలో భాగంగా పట్టణీకరణ అధికమైంది. 1901 గణాంకాల ప్రకారం భారత్ మొత్తం జనాభాలో పట్టణ జనాభా 11.4 శాతం కాగా 2001లో 28.53 శాతం, 2011లో 31.16 శాతానికి పెరిగింది. ప్రతి నిమిషానికి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాలకు వలస వెళ్తున్న కారణంగా 2030 నాటికి  భారత్ పట్టణ  జనాభా 600 మిలియన్లుగా ఉండగలదని అంచనా.
  ప్రపంచవ్యాప్తంగా మధ్య-ఆదాయ స్థాయి హోదా పొందిన దేశాలలో పట్టణ జనాభా సుమారు 50 శాతం కాగా అధిక-ఆదాయ దేశాలలో 70 నుంచి 80 శాతంగా ఉండటాన్ని గమనించవచ్చు. ఆర్థిక కార్యకలాపాలు అధికంగా  ఉన్నందు వల్ల పట్టణాలు ఆయా దేశాలలో వృద్ధి కేంద్రాలుగా రూపొందాయి. పట్టణాలు, నగరాలలో నైపుణ్యత కేంద్రీకృతమైనందు వల్ల ఉత్పాదకత పెరగడంతోపాటు ఉపాధి కల్పన సాధ్యమైంది. ఈ స్థితి పట్టణీకరణ, ఆర్థికవృద్ధి మధ్య ధనాత్మక సంబంధాన్ని స్పష్టపరుస్తుంది.
 
 1. పట్టణీకరణ - కారణాలు:
  {V>Ò$× ప్రాంతాల్లో వ్యవసాయ రంగ కార్యకలాపాలు క్షీణిస్తున్న నేపథ్యంలో వ్యవసాయ రంగంపై జీవనోపాధి కోసం ఆధారపడిన శ్రామిక శక్తి ఇతర ఉపాధి అవకాశాల నిమిత్తం పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లడం వల్ల పట్టణ జనాభా అధికమైంది. నేషనల్ క్రైమ్ రికార్‌‌డ బ్యూరో గణాంకాల ప్రకారం రైతు ఆత్మహత్యలు 2014లో (12,360), 2015లో (12,602), 2016లో (11,379)గా నమోదయ్యాయి. ప్రతి నెలలో సగటున 948 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పంట నష్టం, అధిక రుణ భారం, కుటుంబ సమస్యలు లాంటి అంశాలు రైతుల ఆత్మహత్యలకు కారణాలుగా నిలిచాయి.
  సంస్కరణల తర్వాతి కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఆంక్షలు తొలగించిన నేపథ్యంలో పట్టణ ప్రాంతాలలో పారిశ్రామిక కార్యకలాపాలు విస్తరించాయి. అధిక పారిశ్రామికీకరణ కారణంగా ఉపాధి అవకాశాలు పెరిగాయి. తద్వారా గ్రామీణ ప్రజలు ఉపాధి అవకాశాల నిమిత్తం పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్న కారణంగా పట్టణ జనాభాలో పెరుగుదల ఏర్పడింది.
  జనాభా పెరుగుదల, ఆర్థిక వృద్ధి నేపథ్యంలో  పట్టణ జనాభా పెరిగింది. పెరుగుతున్న పట్టణాలు, నగరాలు పట్టణీకరణకు దారితీసాయి.
  పట్టణ ప్రాంతాలలో వైద్య, ఆరోగ్య సౌకర్యాల లభ్యత కారణంగా గ్రామీణ ప్రాంతాలతో పోల్చినప్పుడు పట్టణ ప్రాంతాలలో జనాభా సహజ వృద్ధి రేటు అధికం. మెరుగైన వైద్య, ఆరోగ్య సౌకర్యాలు, తాగునీరు, పారిశుధ్యం లభ్యత కారణంగా నీటి వల్ల కలిగే వ్యాధులు, సంక్రమణ వ్యాధులు పట్టణ ప్రాంతాలలో తక్కువగా ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు పెరుగుతున్నాయి.
  ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యా రంగంలో అధిక ప్రైవేటు పెట్టుబడుల కారణంగా పట్టణ ప్రాంతాలలో విద్యా సౌకర్యాలు మెరుగయ్యాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం దిశగా అనేక నూతన కోర్సులను ప్రైవేటు విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయి. తద్వారా మెరుగైన విద్యా సౌకర్యాల అందుబాటు నేపథ్యంలో పట్టణ ప్రాంతాలకు వలసలు పెరిగాయి.
  సేవారంగ అభివృద్ధి పట్టణ ప్రాంతాలలో  కేంద్రీకృతం కావడంతో పాటు ఇటీవలి కాలంలో సేవా రంగంలో ఉపాధి అవకాశాలు విస్తరించిన నేపథ్యంలో పట్టణ జనాభా పెరిగింది.
 
 2. అధిక పట్టణీకరణ - సవాళ్లు:
  నీతిఆయోగ్ 2018 జూన్‌లో విడుదలచేసిన ‘కాంపోజిట్ వాటర్ మేనేజ్‌మెంట్ ఇండెక్స్’ నివేదిక ప్రకారం భారత్‌లోని 21 నగరాలలో 2020 నాటికి భూగర్భ జలాలు అంతరించిపోతాయి.
  ముంబై, పుణే, కోల్‌కతాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం పది నగరాలలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతాయని Numbeo గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
  మెకిన్సే నివేదిక ప్రకారం భారత్ పట్టణ జనాభా 2030 సంవత్సరం నాటికి 590 మిలియన్లకు చేరుకుంటుంది. రాబోయే 20 సంవత్సరాల కాలంలో పెరుగుతున్న పట్టణ జనాభాకు మౌలిక సౌకర్యాల నిమిత్తం 1.1 ట్రిలియన్ డాలర్ల మూలధన పెట్టుబడి అవసరం.
  {బూకింగ్‌‌స ఇన్‌స్టిట్యూట్ నివేదిక ప్రకారం వాయు నాణ్యత లోపించిన కారణంగా ఢిల్లీలో 2.5 మిలియన్ల అకాల మరణాలు సంభవించాయి.
  ఆర్థిక సర్వే 2017-18 ప్రకారం దేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో వ్యవసాయ శ్రామికుల వాటా 25.7 శాతానికి తగ్గుతుంది. తద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు పెరుగుతాయి.
 
 3. భారత్‌లో నగరాల మున్సిపల్ రాబడులు:
  భారత్‌లో నగరాల మున్సిపల్ రాబడులు జి.డి.పి.లో ఒక శాతం కన్నా తక్కువ కాగా బ్రెజిల్, దక్షిణాఫ్రికాలో వరుసగా 8 శాతం, 6.9 శాతం. మున్సిపల్ రాబడులను అంతర్గత, బహిర్గత ఆధారాలుగా విభజించవచ్చు. పన్ను, పన్నేతర రాబడులు అంతర్గత ఆధారాలు. యూజర్ ఛార్జీలు, ఫీజు, ప్రీమియం, వడ్డీ, అద్దె లాంటివి పన్నేతర రాబడికి ప్రధాన ఆధారాలు.  వస్తు, సేవల పన్ను అమలు తర్వాత ఆస్తి పన్ను  అంతర్గత ఆధారానికి ప్రధాన రాబడిగా నిలిచింది. వస్తు, సేవల పన్ను అమలుకు ముందు కాలంలో మున్సిపల్ సంస్థల మొత్తం రాబడిలో ఆయా సంస్థల సొంత రాబడి 53 శాతం కాగా, రాష్ట్రాల నుంచి పన్నుల రాబడిలో వాటా, గ్రాంట్-ఇన్-ఎయిడ్ 33.4 శాతం, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు 5.3 శాతం, ఆర్థిక సంఘం గ్రాంట్లు 2 శాతం వాటాను కల్గి ఉన్నాయి.
 
 4. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్య నగరాల సొంత రాబడులకు ఆధారాలు:
  అర్జెంటీనా రాజధాని 'Buenos Aires'  నగర సొంత పన్ను రాబడిలో మొత్తం అమ్మకాల రాబడిపై విధించే టర్నోవర్ టాక్స్ వాటా 50 శాతం.
  కొలంబియాలోని ‘బోగోటా’ మెట్రోపాలిటన్ నగర సొంత పన్ను రాబడిలో టర్నోవర్ టాక్స్ వాటా 40 శాతం. ఈ నగరంలో పన్ను రేటు, పన్ను బేస్‌ను స్థానిక మండళ్లు నిర్ణయిస్తాయి. బోగోటా నగరంలో ఇతర రంగాలలోని స్థూల అమ్మకాలపై ఇతర పన్నులు విధిస్తారు.
  చైనాలో స్థానిక పన్నులు వ్యాపార పన్ను, ఆస్తి పన్ను, పట్టణ భూమి వినియోగ పన్ను,   వాహనాల వినియోగ పన్ను, వాహనాల లెసైన్‌‌స ఫీజు, Ship tonnage tax, డీడ్ టాక్స్, స్టాంప్ టాక్స్, పట్టణ నిర్వహణ, నిర్మాణ పన్ను, Farm land Occupation tax, భూమి వ్యాట్‌గా ఉంటాయి.
  దక్షిణాఫ్రికాలోని మెట్రో పాలిటన్ మున్సిపాలిటీల సొంత పన్ను రాబడిలో ఆస్తి పన్ను వసూళ్ల వాటా 90 శాతం. ఆస్తి పన్ను, యూజర్ ఛార్జీలు మున్సిపాలిటీల సొంత రాబడికి ప్రధాన ఆధారాలు. దక్షిణాఫ్రికా 2004లో ’కఠఛిజీఞ్చ ్కటౌఞ్ఛట్టడ ఖ్చ్ట్ఛట అఛ్టి’ను తీసుకు వచ్చింది. ఈ చట్టం ద్వారా సొంత పన్ను రేటు నిర్ణయం, అవసరానికనుగుణంగా పన్ను రేట్ల వార్షిక సమీక్షకు సంబంధించిన అధికారం మున్సిపాలిటీలకు లభించింది. దక్షిణాఫ్రికాలో ‘మున్సిపల్ వ్యవస్థ చట్టం 2000’ ప్రకారం ప్రతి స్థానిక ప్రభుత్వం 8-10 సంవత్సరాలకు సంబంధించి దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందిస్తాయి. తద్వారా మున్సిపల్ ప్రాంతంలో సాంఘిక, అవస్థాపనా సౌకర్యాలను స్థానిక ప్రభుత్వాలు కల్పిస్తాయి.
  {బెజిల్‌లోని మున్సిపాలిటీల సొంత రాబడికి ఆస్తి పన్ను, సేవలపై పన్ను ప్రధాన ఆధారాలు.  పట్టణ ప్రాంతాలలో భూమి, బిల్డింగుల విలువను నిర్ణయించడానికి బ్రెజిల్‌లోని మున్సిపాలిటీలు ‘మూలధన విలువ పద్ధతి’ని ఉపయోగిస్తారు. బ్రెజిల్‌లోని స్థానిక ప్రభుత్వాలు అవస్థాపనా సౌకర్యాలు, మెరుగైన  సేవల డెలివరీ నిమిత్తం ప్రాధాన్యతలు, ప్రణాళిక రూపొందించడానికి పౌరులు, పౌర సమాజ గ్రూప్‌లు (శ్రామిక యూనియన్లు, కమ్యూనిటీ ఆర్గనైజేషన్‌‌స), స్థానిక ప్రభుత్వ అధికారుల మధ్య చర్చాగోష్టి (Debate)లను నిర్విహిస్తాయి. తద్వారా మున్సిపాలిటీలు ’Participatory Budget’ను రూపొందిస్తాయి. బ్రెజిల్‌లోని Porto Allegre నగరం తొలిసారిగా ఈ బడ్జెట్‌ను రూపొందించింది.
 
 5. పట్టణాభివృద్ధి  - ప్రభుత్వ చర్యలు:
  పట్టణ పేదల జీవన నాణ్యత మెరుగుపరచడానికి గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ స్మార్‌‌ట సిటీస్ మిషన్ (2015 జూన్ 25), ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పట్టణ,  2015 జూన్ 25), స్వచ్ఛ భారత్ మిషన్ (2014, అక్టోబర్ 2), జవహర్‌లాల్ నెహూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ (2005 డిసెంబర్ 3), అమృత్  (2015 జూన్), ఏఖఐఈఅ్గ (2015 జనవరి 21), స్వచ్ఛభారత్ మిషన్ (2014, అక్టోబర్ 2), దీన్ దయాళ్ అంత్యోదయ యోజన-నేషనల్ అర్బన్ లైవ్ లీహుడ్ మిషన్ (2013)లాంటి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తుంది.
  గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు 2019-20 బడ్జెట్‌లో రూ.48,000 కోట్లను కేటాయించారు. 2018-19తో పోల్చినప్పుడు ఈ మొత్తంలో పెరుగుదల 12 శాతం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) కార్యక్రమానికి ప్రస్తుత బడ్జెట్‌లో రూ.6,853 కోట్లను స్మార్‌‌ట సిటీస్ మిషన్‌కు రూ.6,450 కోట్లు, స్వచ్ఛ భారత్ మిషన్‌కు రూ.2,650 కోట్లు, అమృత్‌కు రూ.7,300 కోట్లును కేటాయించారు.
  ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం కింద రూ.4.83 లక్షల కోట్ల పెట్టుబడితో 81 లక్షల గృహాల నిర్మాణం ప్రభుత్వ లక్ష్యం కాగా, ప్రస్తుతం 47 లక్షల గృహాల నిర్మాణం ప్రారంభమైంది. నిర్మాణం పూర్తి అయిన 26 లక్షల గృహాలను లబ్ధిదారులకు అందించారు.
  రోడ్లు, వాటర్ వేస్, మెట్రో, రైల్ లాంటి అవస్థాపనా సౌకర్యాల పెంపుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. భారత్‌మాల, సాగర్‌మాల, ఉడాన్ లాంటి  పథకాలు గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాలను తొలగించడానికి ఉపకరిస్తాయి. 2019-20 కేంద్ర బడ్జెట్‌లో మాస్ రాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థకు రూ.19,152 కోట్లును ప్రభుత్వం కేటాయించింది.
 
మాదిరి ప్రశ్నలు: 





































#Tags