AP ICET 2024 Exam: SKUకు ఐసెట్‌ నిర్వహణ బాధ్యత

అనంతపురం: ఏపీ ఐసెట్‌ (ఇంటిగ్రేటేడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌)–2024 నిర్వహణ బాధ్యతను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి అప్పగించారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి నుంచి సోమవారం ఉత్తర్వులు అందాయి. గతేడాది ఏపీ ఐసెట్‌ను ఎస్కేయూ సమర్థవంతంగా నిర్వహించిన నేపథ్యంలో తాజాగా రెండో దఫా నిర్వహణా బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఈ క్రమంలో ఏపీ ఐసెట్‌ చైర్మన్‌గా ఎస్కేయూ వీసీ కె.హుస్సేన్‌రెడ్డి నియమితులయ్యారు. కన్వీనర్‌గా ఎస్కేయూ ఎంబీఏ, కంప్యూటర్‌ సైన్సెస్‌, కామర్స్‌ విభాగాల్లో నుంచి ఓ ప్రొఫెసర్‌ను ఎంపిక చేయనున్నారు.

చదవండి: ICET Previous Papers

#Tags