AP EAPCET Counselling 2023: ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం
హెల్ప్‌లైన్ కేంద్రాల్లో జులై 25 నుంచి ఆగస్టు 4వ వరకూ అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో పరిశీలిస్తారు. ఆగస్టు 3 నుంచి 8 వరకూ వెబ్ ఆప్షన్ల ఎంపిక, 9వ తేదీ వెబ్ ఆప్షన్ల మార్పు, ఆగస్టు 12న సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఆగస్టు 13 నుంచి 14 వరకూ సెల్ఫ్ రిపోర్టింగ్, లేదా నేరుగా కళాశాలకు వెళ్లి రిపోర్ట్ చేయడం, ఆగస్టు 16 నుంచి ఇంజినీరింగ్, ఫార్మసీ తరగతులు నిర్వహిస్తారు.
Engineering Seats Cutoff: 1,300 ఇంజినీరింగ్ సీట్లు కోత
ఏపీ ఈఏపీసెట్ –2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో ఎన్ని సీట్లు ఖరారు చేశారనే అంశంపై స్పష్టత వచ్చింది. ఏపీ ఉన్నత విద్యామండలికి జేఎన్‌టీయూ అనంతపురం ఉన్నతాధికారులు అనుమతించిన ఇంజినీరింగ్, ఫార్మసీ సీట్లను నివేదించారు. తద్వారా ఉన్నత విద్యామండలి అనుమతించిన సీట్లకే వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి వీలు కలుగుతుంది.