AP EAPCET 2023: కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే.. మీకు వ‌చ్చిన ర్యాంక్‌కు ఏ కాలేజీలో సీటు వ‌స్తుందంటే..? ఈ లింక్ క్లిక్ చేయండి.. చెక్ చేసుకోండిలా..

ఈఏపీ సెట్‌–2023 కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే.. మీకు వ‌చ్చిన ర్యాంక్‌కు ఏ కాలేజీలో సీటు వ‌స్తుందంటే..? ఈ లింక్ క్లిక్ చేయండి.. చెక్ చేసుకోండిలా..

తొలి దశలో భాగంగా ఇంజినీరింగ్, వ్యవసాయ విభాగాల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. జూలై 24వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపులకు అవకాశం కల్పించారు. 25వ తేదీ నుంచి ఆగష్టు 4వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన, 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆప్షన్ల ఎంపిక చేసుకోవడంతో పాటు 9వ తేదీ ఒక్క రోజే ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 12న సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు తెలిపారు. విద్యార్థులు సీట్లు పొందిన కళాశాలల్లో 13, 14వ తేదీల్లో స్వయంగా రిపోర్టు చేయాలని సూచించారు.16వ తేదీ నుంచి తరగతులు  ప్రారంభమవుతాయని, మరిన్ని వివరాలు, సహాయ కేంద్రాల సమాచారం కోసం cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.   

ఏఏ ర్యాంక్‌కు.. ఏఏ ఇంజ‌నీరింగ్‌ కాలేజీ వ‌చ్చిందో..?

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రవాప్తంగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల ప్ర‌క్రియ కొన‌సాగుతున్న విష‌యం తెల్సిందే. ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం.. ఇంజనీరింగ్. అధికశాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు. ఎంసెట్‌లో మీకు వ‌చ్చిన‌ ర్యాంక్‌ల ఆధారంగానే టాప్ ఇంజ‌నీరింగ్ కాలేజీల్లో ప్ర‌వేశాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది.​​​​​​​​​​​​​​

ఈ నేపథ్యంలో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) మీకోసం ప్ర‌త్యేకం ఎంసెట్‌లో మీకు వ‌చ్చిన ర్యాంక్‌ ఆధారంగా.. ఏఏ కాలేజీలో సీటు వ‌చ్చే అవ‌కాశం ఉందో తెలియ‌జేయ‌నున్న‌ది. ఇది కేవలం ఒక అవ‌గాహ‌న కోసం మాత్ర‌మే. ఇది 2022 సంవ‌త్స‌రంలో ఎంసెట్‌ ఏఏ ర్యాంక్‌కు.. ఏఏ ఇంజ‌నీరింగ్‌ కాలేజీ వ‌చ్చిందో అనే దాని ఆధారంగా.. AP EAPCET College Predictor ను ఇవ్వ‌నున్న‌ది. అంతిమంగా ప్ర‌భుత్వం అధికారికంగా విడుద‌ల చేసే ఆధారంగానే మీ కాలేజీ సీట్ల కేటాయింపు ఉంటుంది.

➤☛ AP EAPCET College Predictor (Click Here)

#Tags