AP DSC Notification Update : ప్ర‌తి ఏటా డీఎస్సీ నిర్వ‌హిస్తాం ఇలా... కానీ..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ(DSC) నిర్వహిస్తామని.., టైం టేబుల్ ప్రకారం నోటిఫికేషన్‌లు ఇస్తామని ఏపీ కూట‌మి ముఖ్య‌మంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.

16,347 టీచర్ పోస్టులతో డీఎస్సీపై ముఖ్య‌మంత్రి తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. జూన్‌లో స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి నియామకాలు పూర్తి చేసేందుకు మంత్రి లోకేశ్ చర్యలు తీసుకుంటారన్నారు.

దాదాపు 7.50 లక్షల మంది...

ఇలా రోజుకో మాట చెప్పి... అభ్య‌ర్థుల‌ను మోసం చేసున్నారే కానీ... నోటిఫికేష‌న్ మాత్రం ఇవ్వ‌డం లేదు. దాదాపు 7.50 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులను తీవ్ర నిరాశ‌ ఉన్నారు. త్వరలో నోటిఫికేషన్‌ ఇస్తామంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ శాసనసభలో ప్రకటించడంతో సర్కారు వాయిదాల వ్యూహం బయటపడింది.

ప్రభుత్వంలో ఉన్నవారే..

ఈ వాయిదాల పర్వాన్ని గమనిస్తున్న నిరుద్యోగులు, విద్యారంగ నిపుణులు 2019కి ముందు టీడీపీ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. గతంలోనూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వీస్‌ కమిషన్‌ నుంచి విడుదలైన పలు నోటిఫికేషన్లు వాయిదా పడ్డాయని, ప్రభుత్వంలో ఉన్నవారే పోస్టుల భర్తీని ఆలస్యం చేసేందుకు కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

#Tags