School Education Department: 35,000 మంది సబ్జెక్ట్ టీచర్లకు ఈ ప్రొఫెసర్లతో శిక్షణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 6,000 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో గణితం, భౌతిక, జీవ, రసాయన శాస్త్రాలతో పాటు ఇంగ్లిష్ బోధించే ఉపాధ్యాయులకు అక్టోబర్ 2 నుంచి ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్ ప్రొఫెసర్లతో శిక్షణ ఇవ్వనున్నట్టు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు.
జూలై 6న తిరుపతి ఐఐటీలో ఆ సంస్థ డైరెక్టర్ సత్యనారాయణ, ఐఐఎస్‌ఈఆర్ తిరుపతి డైరెక్టర్ శంతన్ భట్టాచార్య, మద్రాస్ ఐఐటీ ప్రొఫెసర్ మంగళ్‌తో ప్రవీణ్ ప్రకాశ్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి సమావేశమయ్యారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఐఐటీ ప్రొఫెసర్లతో 35,000 మంది సబ్జెక్టు టీచర్లకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తామని ప్రవీణ్ ప్రకాశ్ చెప్పారు.
చదవండి:
RIE CEE Notification: ఉపాధ్యాయ విద్యకు మేటి.. ఆర్‌ఐఈ
#Tags