Tenth Examinations 2024: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు..
సాక్షి ఎడ్యుకేషన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను డీఆర్వో కె.మధుసూదన్‌రావు ఆదేశించారు. జిల్లాలో 162 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 37,801 విద్యార్థులు హాజరుకానున్నట్లు చెప్పారు. సమస్మాత్మక పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని డీఆర్వో చాంబరులో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశమైంది.
Fresher Jobs: జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారా? లేఆఫ్స్ వేళ.. ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్!
ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించాలన్నారు. కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షలు జరిగే రోజుల్లో కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూయించాలన్నారు. విద్యార్థులకు పరీక్షలు రాయడానికి అనువైన సమయంలో ఆర్టీసీ బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మార్చి 18 నుంచి 27వ తేదీ వరకు ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు.
Degree Examination: యలమంచిలి డిగ్రీ కళాశాల నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం
ఓపెన్ టెన్త్ పరీక్షల కోసం 12, ఇంటర్ పరీక్షల కోసం 9 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మార్చి 30 నుంచి ఏప్రిల్3వ తేదీ వరకు ఓపెన్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. డీఈఓ శామ్యూల్ మాట్లాడుతూ 162 పరీక్ష కేంద్రాలకు 162 చీఫ్ సూపరింటెండెంట్లు, 162 మంది డిపార్టుమెంట్ అధికారులను నియమించినట్లు చెప్పారు. పరీక్షల పర్యవేక్షణకోసం 7 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.