Jawad Storm: ‘జవాద్‌’ ఎఫెక్ట్.. స్కూళ్లకు సెలవులు

తీవ్ర తుఫాన్‌ ఉత్తరాంధ్ర దిశగా దూసుకొస్తోంది. ఈ వాయుగుండం తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని…ఈ తుఫాన్‌కు అధికారులు జవాద్ అని నామకరణం చేశారు.
‘జవాద్‌’ ఎఫెక్ట్.. స్కూళ్లకు సెలవులు

జవాద్ తుఫాన్ ప్రభావంతో రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. జవాద్ తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని విజయనగరం జిల్లాలో పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున డిసెంబర్ 3, 4 తేదీల్లో స్కూళ్లకు సెలవులు ఉంటాయని తెలిపారు. ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తుఫాన్ ప్రభావం కారణంగా తూర్పుగోదావరి జిల్లా, శ్రీకాకుళం జిల్లాలలో కూడా డిసెంబర్ 3, 4 తేదీల్లో సెలవులు ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.అత్యవసరమైతే తప్పించి ప్రజలు కూడా బయటకు రావద్దని హెచ్చరించారు. కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశారు.

చదవండి: 

Education Department: పాఠశాలల మూత ప్రచారం అసత్యం

Good News: స్కూళ్ల టీచర్ల బదిలీలకు ఆమోదం

Nadu Nedu: ప్రభుత్వ స్కూళ్లకు నిధుల వరద

#Tags