AP Schools: పాఠశాలల్లో వినియోగదారుల క్లబ్బుల ఏర్పాటు
బాపట్ల అర్బన్: జిల్లాలో వినియోగదారుల ఉద్యమాన్ని మరింత చైతన్యవంతం చేయడంలో భాగంగా ప్రతి పాఠశాలలో క్లబ్బులు ఏర్పాటు చేయనున్నట్లు విద్యాశాఖాధికారి పి.వి.జె. రామారావు తెలిపారు.
పట్టణంలోని బాపట్ల పబ్లిక్ స్కూలులో నవంబర్ 25న వినియోగదారుల క్లబ్బులు, చైతన్యపరిచే తొమ్మిది రకాల పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు హక్కులు, పరిష్కార విధానాల గురించి అవగాహన కల్పించడం ద్వారా ఆరోగ్యకరమైన వినియోగదారులుగా వ్యవహరించేలా తీర్చిదిద్దుతామని చెప్పారు.
జిల్లాలోని 212 వినియోగదారుల క్లబ్బుల ద్వారా ప్రతీ నెలా సెమినార్లు, వర్క్‌షాప్‌లు, చర్చలు నిర్వహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మహమ్మద్ సాదిక్ , శ్రీనివాస రావు, ప్రసాద్ పాల్గొన్నారు.
#Tags