AP 10th Class Results 2023 : 12 ఏళ్లకే టెన్త్ పాసైన విద్యార్థి.. ఈ అమ్మాయికి వచ్చిన మార్కులు ఎన్నంటే..?
సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ పదో పబ్లిక్ పరీక్షల ఫలితాలను మే 6వ తేదీ ఉదయం 11:00 గంటలకు విడుదల చేసిన విషయం తెల్సిందే. గుంటూరు పట్టణంకు చెందిన చిర్రా అనఘాలక్ష్మి 11 ఏళ్ల 8 నెలల వయసులోనే 10వ తరగతి పరీక్షలు రాసింది.
ఈ పదో తరగతి ఫలితాల్లో.. బ్రాడీపేటలోని సెంట్రల్ పబ్లిక్ స్కూల్‌లో చదివిన అనఘాలక్ష్మి అన్ని సబ్జెక్టులలో 90కి పైగా మార్కులతో మొత్తం 600కు గాను 566 మార్కులు సాధించింది.
చదవండి: After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భవిష్యత్ ఉంటుంది..?
పదేళ్ల వయసులో గణితంలో శతావధానం చేసిన అనఘాలక్ష్మి ప్రతిభను గుర్తించిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిందని పాఠశాల డైరెక్టర్ ఆర్.రాము తెలిపారు.
☛ Best Courses After 10th: పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులు, భవిష్యత్ అవకాశాలు ఇవే..
#Tags