CLAT 2025 Notification : నేషనల్‌ లా యూనివర్సిటీల్లో ప్ర‌వేశాల‌కు క్లాట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

నేషనల్‌ లా యూనివర్సిటీల్లో యూజీ, పీజీ డిగ్రీ కోర్సుల్లో (ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం) ప్రవేశాలకు క్లాట్‌–2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఏటా కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌)ను నిర్వహిస్తాయి. ఈ పరీక్షలో మెరుగైన ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 నేషనల్‌ లా యూనివర్శిటీలు ఉన్నాయి.

కోర్సుల వివరాలు
»    అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ (ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ లా డిగ్రీ).
»    పోస్ట్‌–గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ (ఏడాది ఎల్‌ఎల్‌ఎం డిగ్రీ).
»    అర్హత: యూజీ కోర్సులకు కనీసం 45 శాతం మార్కులతో 10+2 లేదా తత్సమాన పరీక్ష, పీజీ కోర్సులకు కనీసం 50 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 15.07.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.10.2024.
»    క్లాట్‌–2025 పరీక్ష(ఆఫ్‌లైన్‌) తేది: 01.12.2024.
»    వెబ్‌సైట్‌: https://consortiumofnlus.ac.in

TSPSC Group 2 New Exam Dates News 2024 : గ్రూప్–2,3 కొత్త ప‌రీక్ష తేదీల‌పై టీఎస్‌పీఎస్సీ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. 

#Tags