NTPC jobs: డిగ్రీ అర్హతతో NTPCలో అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు జీతం నెలకు 1,20,000

NTPC jobs

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) నుండి అసిస్టెంట్ ఆఫీసర్ (సేఫ్టీ) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎంపికైన వారికి 30,000/- నుంచి 1,20,000/- వరకు పేస్కేల్ ఉంటుంది.

Inter అర్హతతో కొత్తగా 8వేల VRO ఉద్యోగాలు: Click Here


భర్తీ చేయబోయే ఉద్యోగాలు: 
NTPC విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఆఫీసర్ (సేఫ్టీ) అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
మొత్తం 50 ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

విద్యార్హతలు: 
కనీసం 60% మార్కులతో మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా సివిల్ లేదా ప్రొడక్షన్ లేదా కెమికల్ లేదా కన్స్ట్రక్షన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ లో ఫుల్ టైం ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 
ఇండస్ట్రియల్ సేఫ్టీలో డిప్లమో లేదా అడ్వాన్స్ డిప్లమో లేదా పీజీ డిప్లమో పూర్తి చేసి ఉండాలి. 

వయస్సు:
NTPC భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు 45 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 

వయస్సులో సడలింపు వివరాలు: 
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వయస్సులో సడలింపు వర్తిస్తుంది. అనగా 
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వరకువయస్సులో సడలింపు వర్తిస్తుంది. 
ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వరకు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

ఎంపిక విధానం:
రాత పరీక్ష లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ వంటివి నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

అప్లికేషన్ ఫీజు: 
జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 300/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టి, PwBD, ఎక్స్ సర్వీస్మెన్ మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.
ఈ ఫీజు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్ విధానంలో చెల్లించవచ్చు.

జీతం:
NTPC లో అసిస్టెంట్ ఆఫీసర్ (సేఫ్టీ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 30,000/- 1,20,000/- పే స్కేల్ ఉంటుంది.

అప్లికేషన్ ప్రారంభ తేది: 
ఈ ఉద్యోగాలకు 26-12-2024 తేది నుండి ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి.

అప్లికేషన్ చివరి తేదీ : 
10-12-2024 తేది నుండి అభ్యర్థులు ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

👉  Click here for notification

👉 Official WebsiteClick here

 

#Tags