Latest jobs: ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం
జిల్లాలో 108 వాహనాల్లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్(ఈఎంటీ)గా పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని 108 జిల్లా మేనేజర్ జి.నాగదీప్ తెలిపారు.
బీఎస్సీ బయాలజీ, బీజడ్–3, బీఎస్సీ నర్సింగ్, బయోకెమిస్ట్రి, మైక్రోబయాలజీ, బీఫార్మశీ, డీఎంఎల్టీ ఐదు సంవత్సరాలు అనుభవం ఉన్నవారు ఉద్యోగానికి అర్హులని పేర్కొన్నారు.
ప్రత్తిపాడు, తెనాలి, మంగళగిరి, వట్టిచెరుకూరు, తుళ్లూరు, ఫిరంగిపురం, కొల్లిపర ప్రాంతాల్లో ఉద్యోగాలకు ఎంపికై న వారు పనిచేయాల్సి ఉంటుందన్నారు.
అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హతలను నవంబరు 17లోపు గుంటూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయం రెండో ఫ్లోర్‌లోని 108 కార్యాలయంలో సంప్రదించాలన్నారు. పూర్తి వివరాలకు 9121892889 నంబరులో సంప్రదించాలని కోరారు.
#Tags