Job Mela: రేపు జాబ్‌మేళా

ఏయూ క్యాంపస్‌: ఏయూ మోడల్‌ కెరీర్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో బుధవారం జాబ్‌ మేళా నిర్వహించనున్నట్టు సంస్థ డిప్యూటీ చీఫ్‌ కె.దొరబాబు తెలిపారు. ఎడికో ఇండియా సంస్థలో టెక్నికల్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలు 200, ఇన్‌స్టలేషన్‌ ఇంజినీర్‌ 30, ఇన్‌స్టలేషన్‌ వైర్‌మేన్‌ 30, ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌ అసెంబ్లింగ్‌ 200 ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. రూ.11 వేలు నుంచి రూ.20 వేల వరకు నెలకు వేతనంగా అందిస్తారన్నారు. సుస్వాదీప్‌ ఆగ్రో సర్వీసెస్‌ లిమిటెడ్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌ 2, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ 10, డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ 30 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. వీరికి రూ.12వేలు నుంచి రూ.16,500 వరకు వేతనంగా అందిస్తారన్నారు. ఆసక్తి గల వారు ncs.gov.in వెబ్‌సైట్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి సమాచారం కోసం 96660 92491 నంబరులో సంప్రదించాలన్నారు.

చ‌ద‌వండి: Indian Army: టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ 51వ కోర్సు శిక్షణలో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా‌..

#Tags