Free training for unemployed youth: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

Free training for unemployed youth

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా కేంద్రంలోని నిరుద్యోగ యువత డొమెస్టిక్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉచిత శిక్షణను వినియోగించుకోవాలని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్‌ రవీంద్రరెడ్డి తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధికల్పన నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో స్కిల్‌ హబ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇందులో మూడు నెలల పాటు డొమెస్టిక్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ శిక్షణకు పదో తరగతి ఉత్తీర్ణత చెంది ఏదైనా డిగ్రీ పూర్తి చేసి 15 నుంచి 45 సంవత్సరాల్లోపు వయసున్న నిరుద్యోగ యువతీ, యువకులు అర్హులన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు అక్టోబర్‌ 15 లోపు కళాశాలలోని స్కిల్‌ హబ్‌లో సంప్రదించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 8919373147, 9160940479ను సంప్రదించాలని ఆయన కోరారు.

#Tags