Free training in tailoring: టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

Free training in tailoring

మహిళా స్వయం ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని, ప్లాస్టిక్‌ నివారణకు స్వశక్తి సంఘాలతో కార్యాచరణను రూపొందిస్తామని డీఆర్‌డీఓ జయదేవ్‌ ఆర్యా అన్నారు. బుధవారం పోతారం(ఎస్‌) గ్రామంలో స్వశక్తి మహిళలు తయారు చేస్తున్న నానో క్లాత్‌ బ్యాగ్స్‌ తయారీ, కుట్టు శిక్షణ, పేపర్‌ ప్లేట్ల తయారీ కేంద్రాలను పరిశీలించారు.

Anganwadi jobs: అంగన్‌వాడీలో ఉద్యోగాలు

ఈ సందర్భంగా మహిళలు తయారు చేస్తున్న విధానము, వారు ఎక్కడి నుంచి సరుకులను తీసుకొస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. పోతారం(ఎస్‌)లో తయారు చేసిన బ్యాగులను ఎక్కడ మార్కెటింగ్‌ చేస్తున్నారని, ప్లాస్టిక్‌ నివారణకు స్వశక్తి మహిళలు కూడా కలిసి రావాలని చూచించారు. జిల్లాలోని కొమురవెల్లి దేవాలయల దగ్గర ప్లాస్టిక్‌ నివారించడానికి ఇలాంటి బ్యాగులను అక్కడ ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

స్వశక్తి సంఘాలు పనితీరును ఎప్పటికప్పుడూ పర్యవేక్షించి వారికి కావాల్సిన ఉపాధికల్పన యూనిట్లను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాగుల నుంచి ఇచ్చే రుణాలను వాయిదా పద్ధతిలో చెల్లించడం కాకుండా వాటిని స్వయం ఉపాధి పొందే విధంగా యూనిట్లు ఏర్పాటు చేయించాలని సూచించారు. వీరి వెంట ఏపీడీ బాలాజీ, ఎంపీడీఓ రాఘవేంద్రరెడ్డి, ఏపీఎం శ్రీనివాస్‌, సర్పంచ్‌ బత్తిని సాయిలు, తదితరులు ఉన్నారు.

#Tags