Free Training in Mobile Repairing: మొబైల్ రిపేరింగ్‌లో ఉచిత శిక్షణ
రామగిరి(నల్లగొండ): చదువు మధ్యలో మానేసిన వారికి ఉచితంగా నాలుగు నెలల పాటు ఇచ్చే మొబైల్ రిపేరింగ్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని నల్లగొండ కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ జి.శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వ, జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 27 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు నల్లగొండలోని కేంద్రీయ విద్యాలయంలో దరఖాస్తు అందజేయాలని కోరారు.
#Tags