Telangana CM Revanth Reddy : తెలంగాణ సీఎం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఇక‌ వీఆర్ఓల‌కు మంచి రోజులే.. ఎందుకంటే..?

వీఆర్ఓలు త్వ‌ర‌లోనే మంచి వార్త వింటార‌ని ఇటీవ‌లె ఐకాస చైర్మ‌న్ ల‌చ్చిరెడ్డి చేసిన వ్యాక్య‌ల్లో తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ నిర్ణ‌యంతో వీఆర్ఓల‌కు మంచి రోజులు రానున్నాయా..

సాక్షి ఎడ్యుకేష‌న్: అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో సంచ‌ల‌న నిర్ణ‌యాలను ప్ర‌క‌టించారు. త‌న నిర్ణ‌యాల‌తో తెలంగాణ రాష్ట్రంలో ప‌రిపాల‌న కొన‌సాగిస్తునే వ‌చ్చారు రేవంత్‌. ఇందులో ఒక నిర్ణ‌య‌మే హైడ్రా, ఇది మాత్రం త‌న నిర్ణ‌యాల్లో ఎంతో ముఖ్యంగా, కీల‌కంగా నిలిచింది. ఇది మూసిన‌ది ప్ర‌క్షాళ‌న వంటి వ్య‌వ‌హారాలు మంచి స్థానంలో నిల‌బెట్టాయి.

Kids Talent Showcase Program: మీ పిల్లల టాలెంట్‌ను ప్రపంచానికి చాటిచెప్పే ఛాన్స్‌.. డోంట్‌ మిస్‌!

ఇదిలా ఉంటే, మ‌రోవైపు రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ ర‌ద్దు చేసిన వీఆర్ఓ ఇప్పుడు తిరిగి ప్ర‌వేశ పెట్టేందుకు సిద్ధ‌ప‌డుతున్నార‌ని తెలంగాణ ఉద్యోగుల ఐకాస చైర్మ‌న్ ల‌చ్చిరెడ్డి మాట‌ల‌తో తెలుస్తోంది. త్వ‌ర‌లోనే వీఆర్ఓలకు తీపి క‌బురు అందుతుంద‌ని ఆయ‌న చేసిన వ్యాక్య‌లు బలంగా చేకూరుస్తున్నాయి. అయితే, సీఎం రేవంత్‌, గ‌తంలో కేసీఆర్ రద్దు చేసిన వీఆర్ఓ పోస్టుల వ్య‌వ‌స్థ‌ను మ‌రోసారి వెలుగు తెచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు అని అర్థం అవుతుంది. 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

అయితే, అప్ప‌ట్లో ఈ వ్య‌వ‌స్థ కార‌ణంగా రెవెన్యూ శాఖ‌లో అవినీతి ఎంతో పెరిగింద‌ని ఆరోప‌ణ‌లు రావ‌డంతో అప్పటి ప్ర‌భుత్వం వివిధ శాఖ‌ల్లో స‌ర్దుబాటు చేయ‌డంతో ఒక కొలిక్కి వ‌చ్చిందుకున్నారు. కాని, కేసీఆర్‌కు తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్ప‌డింది. 

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

తాజాగా, ప్ర‌స్తుత సీఎం రేవంత్ రెడ్డి, మ‌రోసారి ఈ వ్య‌వ‌స్థ‌ను పునరుద్ధరించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టార‌ని తెలుస్తోంది. అయితే, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప‌రీక్ష‌లతో వీఆర్ఓల‌కు నేరుగా పోస్టింగ్ ఇప్ప‌స్తార‌ని, మ‌రికొన్ని పోస్టుల‌కు ప్ర‌త్యేక పరీక్ష‌లు ఉంటాయిని వార్త‌లు వ‌స్తున్నాయి.

District Court jobs: 10వ తరగతి ఉత్తీర్ణతతో తెలంగాణ జిల్లా కోర్టులో రికార్డ్ అసిస్టెంట్ ,టైపిస్ట్ ఉద్యోగాలు

ప్ర‌స్తుతం, రాష్ట్రంలో 3,000 మంది వీఆర్ఓలు ఉండగా, మ‌రో 8 పోస్టు భ‌ర్తీకి సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం, రాష్ట్రంలో ఉన్న‌10,909 రెవెన్యూ గ్రామాలకు వీఆర్వోలను నియమిస్తారని స‌మాచారం.

#Tags