Free laptop Scam: విద్యార్థులకు కేంద్రం ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్.. ఈ విషయం మీరు గమనించారా?

Free laptop

కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం చాలా రకాల పథకాలు తెచ్చింది. ఎన్నో రకాల స్కాలర్‌షిప్‌లు కూడా ఉన్నాయి. చాలా మంది విద్యార్థులు వాటిని పొంది, ఉన్నత విద్యను చదువుకోగలుగుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు కేంద్రం ఉచిత ల్యాప్‌టాప్ ఇస్తోంది అనే అంశంపై పూర్తి వివరాలు తెలుసుకుందాం.

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 3రోజుల పాటు స్కూళ్లకు వరుస సెలవులు: Click Here

విద్యార్థుల కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చాలా రకాల పథకాలు, స్కాలర్‌షిప్‌లు, క్విజ్‌ల వంటివి నిర్వహిస్తూ, పేద విద్యార్థులు బాగా చదువుకునేందుకూ, ఉన్నత స్థాయికి చేరేందుకు కృషి చేస్తోంది. ఒక్కోసారి విదేశాలకు వెళ్లి కూడా చదవడానికి ఇంటర్న్‌షిప్ లాంటివి ఇస్తోంది. ఐతే.. కొంతమంది ప్రజలను తప్పుదారి పట్టించేందుకు అసత్య పథకాలను ప్రచారం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్ ఇస్తోంది అనేది కూడా అందులో భాగమే.

సోషల్ మీడియాలో ఈ తప్పుడు ప్రచారం జరుగుతోంది. కేంద్రం ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ (AICTE) ద్వారా విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్ ఇస్తోందనీ, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని, ఫ్రీగా ల్యాప్‌టాప్ పొందాలని సోషల్ మీడియాతోపాటూ.. కొన్ని వెబ్‌సైట్లు కూడా ప్రచారం చేస్తున్నాయి. అయితే, ఇదంతా స్కామ్ అని తేలిపోయింది.

ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని AICTE స్వయంగా ఒక సర్క్యులర్‌ని నవంబర్ 27, 2024న జారీ చేసింది. ఆ సర్క్యులర్‌ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ సర్క్యులర్‌లో ఏముందంటే.. "ఒక ఫేక్ న్యూస్ ఆర్టికల్.. సోషల్ మీడియాలో, వెబ్‌సైట్లలో సర్క్యులేట్ అవుతుంది. అందులో AICTE విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్ ఇస్తోందని ఉంది. అది మొత్తం అబద్ధం. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఆ న్యూస్‌తో AICTEకి ఎలాంటి సంబంధమూ లేదు" అని సర్క్యులర్‌లో తెలిపారు.

AICTE ఇంకా ఏం చెప్పిందంటే.. "విద్యార్ధులకు ఉచిత ల్యాప్‌టాప్‌లను అందించడానికి, ఎటువంటి పథకాన్నీ మేము ప్రారంభించలేదు. అలాంటి ప్రోగ్రామ్‌కు సంబంధించి AICTE నుంచి ఎలాంటి సర్క్యులర్, నోటిఫికేషన్ లేదా అధికారిక సమాచారం రాలేదు. ఈ పథకాన్ని ఇలా పొందండి అంటూ.. చెప్పిన విధానం అంతా నకిలీయే" అని సర్క్యులర్‌లో వివరించారు.

ఇంకా ఈ సర్క్యులర్‌లో విద్యార్థులకు ఒక సలహా కూడా ఇచ్చింది. ఇలాంటి నకిలీ వార్తలను విస్మరించమని AICTE అందరు విద్యార్థులు, విద్యా సంస్థలు, ప్రజలందరికీ సూచించింది. ఇలాంటి తప్పుడు వార్తలు చెప్పి.. ఎవరైనా మనీ అడిగితే చెల్లించవద్దు అని AICTE తెలిపింది. అధికారిక వెబ్‌సైట్, అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో ఇచ్చిన సమాచారం మాత్రమే నమ్మాలని సూచించింది. అందువల్ల ఇకపై ఎవరైనా ఉచిత ల్యాప్ టాప్ స్కీమ్‌ని కేంద్రం ఇస్తోందని చెబితే.. అస్సలు నమ్మొద్దు. ఇదే కాదు ఏ పథకమైనా అధికారిక పోర్టల్స్‌లో వస్తేనే నమ్ముదాం.

#Tags