Changes in APPSC: APPSCలో మార్పులు ఉత్తర్వులు జారీ

APPSC

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో మార్పులు చేపట్టేందుకు అవసరమైన అంశాలపై అధ్యయనం కోసం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశే­ఖర్‌ అధ్యక్షుడిగా ఏడుగురు ఉన్నతాధి­కారు­లతో ప్రభుత్వం కమిటీని నియమించింది.

మహిళల ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ 12రోజులు సెలవులు: Click Here

ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఇతర రాష్ట్రాల్లోని సర్వీస్‌ కమిషన్స్‌లో అనుసరిస్తున్న విధానాలు, వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల జారీ తదితర అంశాలపై అధ్యయనం చేసి ఈనెల 30వ తేదీ నాటికి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

#Tags